Mahesh Kumar | సీఎం రేవంత్‌రెడ్డి కాదు.. రేవంత్ గౌడ్.. ఆయన మాకు సోదరుడి లాంటివారు
Mahesh Kumar | పుడితే రాజుగా పుట్టాలని, లేదంటే గౌడ్‌గా పుట్టాలని గతంలో సీఎం చెప్పారని.. ఆయన మాకు సోదరుడిలాంటి వాడని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు. అందుకే ఆయన రేవంత్‌రెడ్డి కాదని.. రేవంత్ గౌడ్ అని సరదాగా సంబోధించారు.
- పుడితే రాజుగా లేదంటే గౌడ్‌గా పుట్టాలని గతంలో సీఎం చెప్పారు
- బహుజనుల అభివృద్ధికి ఎంతో పని చేస్తుండు
- గౌడ్స్ తలుచుకుంటే ఐదుసార్లు ప్రభుత్వం ఏర్పడుతది
- టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Mahesh Kumar | త్రినేత్ర.న్యూస్: పుడితే రాజుగా పుట్టాలని, లేదంటే గౌడ్‌గా పుట్టాలని గతంలో సీఎం చెప్పారని.. ఆయన మాకు సోదరుడిలాంటి వాడని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు. అందుకే ఆయన రేవంత్‌రెడ్డి కాదని.. రేవంత్ గౌడ్ అని సరదాగా సంబోధించారు. గౌడ్స్ తలుచుకుంటే మరో ఐదుసార్లు ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. బహుజనుల కోసం సీఎం రేవంత్ ఎంతో చేస్తుండని కొనియాడారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా మంగళవారం ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహావిష్కరణ సభలో ఆయన ప్రసంగించారు.
రేవంత్ గౌడ్ కృషి వల్లే..
బహుజనుల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారు. రేవంత్ గౌడ్‌గా బహుజనులకు అండగా ఉండాలి. గౌడ్‌లు తలుచుకుంటే మరో ఐదు సార్లు ప్రభుత్వం ఏర్పడుతుంది. సర్ధార్ సర్వాయి పాపన్న నిరుపేద కుటుంబంలో పుట్టి గోల్కొండ కోటను జయించారు. మహనీయుల విగ్రహాలు రేవంత్ గౌడ్ కృషి వల్ల వచ్చాయి. గతంలో సర్వాయి పాపన్న విగ్రహం స్థలం సీఎం రేవంత్ చూపించారు. నేడు అక్కడే విగ్రహం ఆవిష్కరించుకున్నాం. కల్లు గీత కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్మికులను ప్రోత్సహించాలి. సీఎం రేవంత్ ఒకసారి కల్లు రుచి చూడాలి అని మహేశ్‌కుమార్ సరదాగా వ్యాఖ్యానించారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | 20న లండన్‌లో ఎంఐఎం ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి
ఆగస్టు 18, 2026

Ramchandar Rao | కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో హామీ ఇచ్చారు.. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టండి
ఆగస్టు 18, 2026

RS Praveen Kumar | ఉద్దేశపూర్వకంగానే కళ్యాణలక్ష్మి పథకం రద్దుకు కుట్ర : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఆగస్టు 18, 2026
తాజావార్తలు
- ●India US trade | భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం.. 2030 వరకు 500 బిలియన్ల డాలర్లకు..
- ●Minister Tummala | రైతుల అవసరాలే లక్ష్యంగా ఉద్యాన పరిశోధనలు ఉండాలి
- ●Strait of Hormuz | హార్ముజ్ జలసంధి మాదే.. ఒమన్ అడ్డువస్తే బాంబులేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్, బదులిచ్చిన టెహ్రాన్!
- ●Sara Arjun | రామ్‌చరణ్‌కు జోడీగా ధురంధర్ హీరోయిన్? - ఆర్సీ 17పై కొత్త రూమర్
- ●Minister Komatireddy | 22ఏ జాబితా వెనుక కుట్ర ఉండొచ్చు.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్
- ●Maharashtra Freedom of Religion Act 2026 | మహారాష్ట్రలో ఆగస్టు 28 నుంచి 'మత మార్పిడి నిరోధక చట్టం' అమలు.. గెజిట్ విడుదల, శిక్షల వివరాలు ఇవే!

India US trade | భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం.. 2030 వరకు 500 బిలియన్ల డాలర్లకు..

Minister Tummala | రైతుల అవసరాలే లక్ష్యంగా ఉద్యాన పరిశోధనలు ఉండాలి

Strait of Hormuz | హార్ముజ్ జలసంధి మాదే.. ఒమన్ అడ్డువస్తే బాంబులేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్, బదులిచ్చిన టెహ్రాన్!

Sara Arjun | రామ్‌చరణ్‌కు జోడీగా ధురంధర్ హీరోయిన్? - ఆర్సీ 17పై కొత్త రూమర్



