త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Eatala Rajender | తెలంగాణలో పుట్టే ప్రతి బిడ్డ నెత్తి మీద రెండు లక్షల అప్పుతో పుడుతున్నరు

సింగరేణి సంస్థను అప్పుల ఊబిలోకి నెట్టి కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. రూ.55 వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

J

Adilabad | Published On Sep 30, 2026, 5.03 pm IST

Eatala Rajender | తెలంగాణలో పుట్టే ప్రతి బిడ్డ నెత్తి మీద రెండు లక్షల అప్పుతో పుడుతున్నరు

సంక్షిప్త సారాంశం

సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.55 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కోల్ ఇండియా తరహాలోనే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రోజుకు రూ.1,250 చెల్లించాలని, ఔట్‌‌సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాలని కోరారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత తీవ్రమైందని, 24 గంటల సరఫరా లేక మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని ఆరోపించారు. నాణ్యమైన బొగ్గు ప్రైవేటు వ్యక్తుల పాలవుతోందని, 30 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు అక్రమంగా తరలిపోయిందని తీవ్ర విమర్శలు చేశారు.

Advertisement
  • తెలంగాణ ప్రజలారా..
  • మన పౌరుషం ఎక్కడికి పోయింది ?
  • ఎక్కడ పోయింది మన రేషం ?
  • ఎక్కడ పోయింది మన ఐక్యత ?
  • బరిగీసి కోట్లాడే తెలంగాణ, రాజీపడి ఎందుకు బతుకుతున్నది?
  • ఎన్ని నిర్బంధాలు ఎదుర్కున్నాము..
  • ఎన్ని సమరశీల పోరాటాలు చేశాము..
  • ఎంత చైతన్యాన్ని అందించాము..
  • అలాంటి ప్రజలం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం మంచిది కాదు
  • సింగరేణి ప్రాంతంలో రోడ్లు లేవు కానీ సింగరేణి డబ్బులు పెట్టి మెస్సీతో ఫుట్ బాల్ ఆటకు డబ్బులు ఖర్చు పెట్టారు
  • సింగరేణి సంపద కొద్దిమంది పెట్టుబడిదారులకు, బ్రోకర్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు
  • తెలంగాణ కోసం కొట్లాడిన కార్మికుల జీవితాలు చీకట్లో మగ్గుతున్నాయి
  • ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుంది?
  • కేసీఆర్ మాటలు కోటలు దాటాయి, కాళ్ళు తంగెళ్లు దాటలేదు
  • కేసీఆర్ పార్టీని బొంద పెట్టాలని రేవంత్ కి ఓటు వేస్తే.. నన్ను కోసినా రూపాయి లేదు అంటున్నారు
  • సింగరేణి బకాయిలు రూ.55 వేల కోట్లు ఇవ్వాల్సిందే
  • కేసీఆర్, రేవంత్‌లపై ఎంపీ ఈటల రాజేందర్ నిప్పులు

Eatala Rajender | త్రినేత్ర న్యూస్ : సింగరేణి కాలరీస్ సంస్థను గత కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశాయని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అసలు, వడ్డీతో కలిపి సంస్థకు రావాల్సిన రూ.55 వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని సీసీసీ కార్నర్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ "సింగరేణి ధర్నా"లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

Etela Rajender Slams Revanth and KCR Over Singareni Dues Coal Loot

తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి 40 రోజుల పాటు సమ్మె చేసిన ఘనత సింగరేణి కార్మికులదని ఈటల గుర్తుచేశారు. కానీ స్వరాష్ట్రంలో వారి బతుకులు చీకటిమయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 1.16 లక్షల మంది రెగ్యులర్ కార్మికులు ఉండగా, ఇప్పుడా సంఖ్య 39 వేలకు పడిపోయిందని, 70 వేల మంది ఔట్‌సోర్సింగ్ వర్కర్లపై సంస్థ నడుస్తోందని పేర్కొన్నారు.

Etela Rajender Slams Revanth and KCR Over Singareni Dues Coal Loot

అప్పుల ఊబిలో సింగరేణి.. నిలిచిన అత్యవసర సేవలు

రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వకపోవడంతో సింగరేణి యాజమాన్యం 9 నుంచి 12 శాతం వడ్డీతో అప్పులు తెచ్చి నెట్టుకొస్తోందని ఈటల వివరించారు. కనీసం అండర్‌గ్రౌండ్ గనుల్లో పనిచేసే కార్మికులకు సేఫ్టీ ఎక్విప్‌మెంట్ కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు. చివరికి కార్మికులు, వారి కుటుంబాలకు అవసరమైన మెడిసిన్స్ కొనుగోలు చేయడానికి కూడా నిధులు లేకపోవడం అత్యంత దారుణమని మండిపడ్డారు.

Etela Rajender Slams Revanth and KCR Over Singareni Dues Coal Loot

రూ.1250 వేతనం ఇవ్వాల్సిందే.. ఏజెన్సీలు రద్దు చేయాలి

కోల్ ఇండియాలో కాంట్రాక్ట్ కార్మికులకు రోజుకు రూ.1250 చెల్లిస్తుంటే, సింగరేణిలో మాత్రం కేవలం రూ.600 ఇచ్చి శ్రమదోపిడీ చేస్తున్నారని విమర్శించారు. వెంటనే కాంట్రాక్ట్ వర్కర్లకు రూ.1250 చెల్లించాలని, మధ్యవర్తిత్వం వహిస్తూ లంచాలు తీసుకుంటున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్మికులపై వేధింపులు, కొత్త పీఏఏ (PAA) డిస్మిసల్ విధానాలను ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

Etela Rajender Slams Revanth and KCR Over Singareni Dues Coal Loot

బొగ్గు దోపిడీపై ఘాటు విమర్శలు

రాష్ట్ర సాధన సమయంలో 48 భూగర్భ గనులు ఉంటే, వాటిని 24కు తగ్గించేశారని ఆరోపించారు. గతంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్‌లో మట్టి తీసేందుకు మాత్రమే ప్రైవేట్ మిషనరీ వాడేవారని, కానీ ఇప్పుడు ఏకంగా బొగ్గు వెలికితీత బాధ్యతను కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్లకే అప్పగించారని మండిపడ్డారు. కమిషన్ల కోసం కార్మికుల పొట్టకొడుతూ సుమారు 30 లక్షల మెట్రిక్ టన్నుల నాణ్యమైన బొగ్గును ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా తరలించారని సంచలన ఆరోపణలు చేశారు.

Etela Rajender Slams Revanth and KCR Over Singareni Dues Coal Loot

"సింగరేణి ప్రాంతంలో రోడ్లు నిర్మించడానికి పైసలు లేవు కానీ, సింగరేణి ఫండ్స్ తీసుకెళ్లి మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడించేందుకు ఖర్చు చేశారు" అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారంలోకి రావడానికి అమలు కాని గ్యారెంటీలు ఇచ్చి రేవంత్ మోసం చేశారని, ఇప్పుడు అడిగితే 'నన్ను కోసినా రూపాయి లేదు' అంటున్నారని ఎద్దేవా చేశారు. అత్యంత వేగంగా దూసుకుపోతుంది అనుకున్న తెలంగాణ అత్యంత దయనీయ స్థితిలోకి పోతుందని.. ఇప్పటికైనా అందరూ మేల్కోవాలన్నారు. పుట్టబోయే బిడ్డ 2 లక్షల రూపాయలు అప్పుతో పుడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ బదులు కేవలం 8 గంటలు మాత్రమే సరఫరా జరుగుతోందని, లో ఓల్టేజీ కారణంగా మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు తగలబడిపోతున్నాయని ఆరోపించారు.

Etela Rajender Slams Revanth and KCR Over Singareni Dues Coal Loot

ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేరబెల్లి రఘునాథ్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లుతో పాటు పలువురు కార్మిక సంఘాల నాయకులు, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Etela Rajender Slams Revanth and KCR Over Singareni Dues Coal Loot

Advertisement
Advertisement