Sabitha Indra Reddy | పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు ప్రజాస్వామ్య విరుద్ధం : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Sabitha Indra Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పట్నం నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని బిఆర్‌ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
Sabitha Indra Reddy | త్రినేత్ర న్యూస్ : కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పట్నం నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని బిఆర్‌ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కోస్గిలో మృతి చెందిన పార్టీ కార్యకర్త కుటుంబానికి పరామర్శ తెలిపేందుకు, వారి అంత్యక్రియలలో పాల్గొనేందుకు వెళ్తున్న నరేందర్ రెడ్డిని పరిగి బహార్‌పేట్ చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేయడం అత్యంత అన్యాయం, ప్రజాస్వామ్య విరుద్ధం అని పేర్కొన్నారు.
ఓదార్చడానికి వెళ్తున్న నాయకుడిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమి వచ్చింది? 'ప్రజా పాలన' అందిస్తున్నామని, ఇనుప కంచెలు ఉండవని ప్రగల్బాలు పలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేడు రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతు నొక్కడమే పనిగా పెట్టుకున్నారు. నేడు తెలంగాణలో ఎక్కడ చూసినా ప్రశ్నించే గొంతులను అణచివేయడం, ప్రతిపక్ష నాయకుల అక్రమ అరెస్ట్‌లు, నిరంకుశ నిర్బంధాలు మాత్రమే కనిపిస్తున్నాయని మండిపడ్డారు.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే, పరామర్శించే హక్కు కూడా లేకుండా చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం. అక్రమ అరెస్టులతో బిఆర్‌ఎస్ శ్రేణుల మనోధైర్యాన్ని దెబ్బతీయలేరు. అక్రమంగా అరెస్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వెంటనే ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలి. ఇటువంటి కక్షసాధింపు చర్యలను ప్రభుత్వం తక్షణమే స్వస్తి పలకాలి అని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
తాజావార్తలు
- ●Indian Rupee | డాలర్‌తో పోరులో రూపాయి రికవరీ.. రూ.92.50కి చేరుతుందా..?
- ●KA Paul | రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దించుతా : కేఏ పాల్
- ●DK Shivakumar | షాకింగ్.. కర్ణాటక సీఎంపై చెప్పులు విసిరిన మహిళలు
- ●Devireddy Sudheer Reddy | రాష్ట్రాన్ని ఎండవెట్టిన దుర్మార్గునివి నువ్.. కరువు తెచ్చిన ప్రథమ ముద్దాయివి
- ●Patnam Narender Reddy | ప్రజా పాలనే కదా..! భయమెందుకు రేవంత్ రెడ్డి..!!
- ●Egg Chicken Price Increase | కోడిగుడ్లు, చికెన్ ధరలు జెట్ స్పీడ్.. కొండెక్కుతున్న ధరల వెనుక అసలు రహస్యం ఇదే!

Indian Rupee | డాలర్‌తో పోరులో రూపాయి రికవరీ.. రూ.92.50కి చేరుతుందా..?

KA Paul | రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దించుతా : కేఏ పాల్

DK Shivakumar | షాకింగ్.. కర్ణాటక సీఎంపై చెప్పులు విసిరిన మహిళలు

Devireddy Sudheer Reddy | రాష్ట్రాన్ని ఎండవెట్టిన దుర్మార్గునివి నువ్.. కరువు తెచ్చిన ప్రథమ ముద్దాయివి




