Government Job | ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదని ఆత్మహత్య చేసుకున్న యువకుడు
Government Job | కుమారస్వామి గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్నాడు. పలుమార్లు పరీక్షలు రాసినప్పటికీ ఉద్యోగం సాధించలేకపోయాడు. దీంతో మానసికంగా కుండిపోయిన అతడు..
Government Job | త్రినేత్ర.న్యూస్: ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు (Government Job), క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు అంటూ నిరోద్యుగులపై వరాలు కురిపించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చి రెండేండ్లవుతున్నా ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లనే రద్దుచేసి మళ్లీ కొత్తగా నియామక ప్రక్రియ చేపట్టింది. దీంతో సర్కారు కొలువుల కోసం ఎదురుచూస్తున్న యువత నిరుత్సాహానికి లోనవుతున్నారు. అప్పులు చేసిమరీ పోటీపరీక్షలు సన్నద్ధమవుతున్నామని.. ఏండ్లు గడుస్తున్నా ప్రభుత్వం మాత్రం ఉద్యోగాల ఊసెత్తడం లేదంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా, ప్రభుత్వ ఉద్యోగం రాలేదంటూ ఓ యువకుడు బలవన్మరణం చెందాడు.
హనుమకొండ జిల్లా వేలేరు మండలం సోడాషపల్లికి చెందిన బండారి కుమారస్వామి (33) బీటెక్ పూర్తిచేశాడు. ఆయనకు భార్య స్వప్న, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారస్వామి గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్నాడు. పలుమార్లు పరీక్షలు రాసినప్పటికీ ఉద్యోగం సాధించలేకపోయాడు. దీంతో మానసికంగా కుండిపోయిన అతడు.. తరచూ బాధపడేవాడు. దిగులుతో ఉంటున్న భర్తకు ఉద్యోగం రాకోపయిన పర్వాలేదు.. వ్యవసాయం చేసుకుని జీవిద్దామని భార్య స్వప్న సర్ది చెప్పింది.
అయినా వినకుండా తన పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల రైతులు చూసి స్వప్నతోపాటు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తన భర్త మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని, ప్రభుత్వ ఉద్యోగం రాలేదనే ఆత్మహత్య చేసుకున్నాడని స్వప్న తెలిపింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం
- ●KTR | కేసీఆర్‌కు వారం రోజులు కాళేశ్వరంను అప్పజెప్పు.. రాష్ట్రమంతా నీళ్లు పారిస్తాం..
- ●Instagram CSAM Ads | ఇన్‌స్టాగ్రామ్‌పై కేంద్రం కొరడా.. ఆ అసభ్యకరమైన యాడ్స్ ఏంటి? మెటాకు 7 రోజుల డెడ్‌లైన్!

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం

New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం

Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం






