త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGSRTC Elections | ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం.. ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియ‌న్

TGSRTC Elections | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాగ్రెస్‌కు భంగ‌పాటు త‌ప్ప‌లేదు. పార్టీ అనుబంధ యూనియ‌న్‌ను కాద‌ని మ‌ద్ద‌తు ప‌లికిన టీడ‌బ్ల్యూయూకు (TWU) ఎదురుదెబ్బ త‌గిలింది. ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్ (EU) కూటమి ఘన విజయం (TGSRTC Elections) సాధించింది.

G

Telangana | Published On Oct 10, 2026, 7.43 am IST

TGSRTC Elections | ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం.. ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియ‌న్
Advertisement

TGSRTC Elections | త్రినేత్ర న్యూస్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాగ్రెస్‌కు భంగ‌పాటు త‌ప్ప‌లేదు. పార్టీ అనుబంధ యూనియ‌న్‌ను కాద‌ని మ‌ద్ద‌తు ప‌లికిన టీడ‌బ్ల్యూయూకు (TWU) ఎదురుదెబ్బ త‌గిలింది. ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్ (EU) కూటమి ఘన విజయం (TGSRTC Elections) సాధించింది. దాదాపు పదేండ్ల‌ తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో ఏఐటీయూసీ (AITUC) మద్దతునిచ్చిన ఎంప్లాయీస్ యూనియన్ (బస్సు గుర్తు) రాష్ట్రస్థాయి గుర్తింపు సంఘంగా అవతరించింది. ప్ర‌త్య‌ర్థి కూట‌మిపై దాదాపు 6 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. రాష్ట్ర‌వ్యాప్తంగా 93 డిపోల్లో శుక్ర‌వారం జ‌రిగిన పోలింగ్ 98 శాతం మంది కార్మికులు ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఈనెల 14, 15 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌లో 980 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అనంతరం, ఈనెల 17న తుది ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారు.

కాగా, ఈ ఎన్నిక‌ల్లో ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (EU), తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (TMU), నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ (NMU) ఒక కూటమిగా బరిలో నిలిస్తే.. తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌ (TWU), స్టాఫ్‌ వర్కర్స్‌ అండ్‌ ఫెడరేషన్‌ (SWU) మరో కూటమిగా పోటీ చేశాయి.

దూసుకెళ్లిన బ‌స్సు..

జిల్లాల్లో టీడబ్ల్యూయూ కూటమి పైచేయి సాధిస్తే.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఈయూ వియం సాధించింది. గ్రేటర్‌ జోన్‌ హైదరాబాద్‌- సికింద్రాబాద్‌ రీజియన్‌లో 26 బస్‌ డిపోలు ఉండగా 23 స్థానాల్లో ఈయూ, మూడు చోట్ల టీడబ్లూయూ ముందంజలో నిలిచాయి.

క‌రీంన‌గ‌ర్ రీజియ‌న్‌లో 11 డిపోలు ఉండ‌గా.. క‌రీంన‌గ‌ర్‌-1, హుజూరాబాద్‌, సిరిసిల్ల‌, వేముల‌వాడ‌, జగిత్యాల‌, కోరుట్ల‌, గోదావ‌రిఖ‌ని, మంథ‌నిల్లో టీఎంయూ విజ‌యం సాధించింది. క‌రీంన‌గ‌ర్‌-2, మెట్‌ప‌ల్లి, హుస్నాబాద్ డిపోల్లో కాంగ్రెస్ కూట‌మి గెలుపొందింది. జోన‌ల్ వ‌ర్క్‌షాప్‌తోపాటు ఆర్ఎం కార్యాల‌యంలో టీడ‌బ్ల్యూయూ విజ‌యం సాధించింది.

ఆర్టీసీ ఎన్నికల్లో రాష్ట్రస్థాయి గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్ నిల‌డంపై కొత్త‌గూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం ఆర్టీసీ కార్మికులదేనని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులకు ఎర్రజెండా పట్ల ఉన్న విశ్వాసాన్ని చాటుతోందని పేర్కొన్నారు. ఈయూ, ఎన్‌ఎంయూ, టీఎంయూ సంఘాలకు అభినందనలు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధనకు సీపీఐ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. బాబు, ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న నేతృత్వంలో కార్మికులు, నాయకులు హైదరాబాద్‌లోని యూనియన్ కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి నుంచే సంబరాలు జరుపుకుంటున్నారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement