Election Code | తెలంగాణలో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ప్రకటించిన ఎస్ఈసీ
Election Code | తెలంగాణలో గ్రామపంచాయతీల ఎన్నికల పర్వం ముగిసింది. మొత్తం 12702 గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. మొదటి విడుత ఎన్నికలు ఈ నెల 11న, రెండో విడుత 14న, మూడో విడుత ఎన్నికలు 17వ తేదీన నిర్వహించారు. అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
Election Code | హైదరాబాద్ : తెలంగాణలో గ్రామపంచాయతీల ఎన్నికల పర్వం ముగిసింది. మొత్తం 12702 గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. మొదటి విడుత ఎన్నికలు ఈ నెల 11న, రెండో విడుత 14న, మూడో విడుత ఎన్నికలు 17వ తేదీన నిర్వహించారు. అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ మేరకు పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేసింది. ఎన్నికలు ముగియడంతో ఎన్నికల కోడ్‌ను ఎత్తేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 11,497 మంది సర్పంచ్‌లుగా ఎన్నికైనట్లు ప్రకటించారు. 85,955 మంది వార్డు సభ్యులు ఎన్నికయ్యారు. 1205 సర్పంచ్ స్థానాలు, 25848 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లో 13523137 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 85.30 శాతం పోలింగ్ నమోదైంది.
ఎన్నికల విధి నిర్వహణలో ఇద్దరు అధికారులు మృతి
ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా ఇద్దరు ఉద్యోగులు మృతి చెందగా, వారికి ఎన్నికల అధికారులు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎంపీడీవో రాజేంద్ర ప్రసాద్, ఆసిఫాబాద్ మిషన్ భగరీథ ఏఈ కట్ట రాజు మరణించినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



