Edupayala Jatara | ఫిబ్రవరి 15 నుంచి ఏడుపాయల జాతర.. మూడురోజులపాటు బ్రహ్మోత్సవాలు
Edupayala Jatara | మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గా దేవి బ్రహ్మోత్సవాలకు (Edupayala Jatara) వేలయింది. ఫివ్రవరి 15 నుంచి 17 వరకు మూడు రోజులపాటు వైభవంగా జాతర జరుగనుంది.
Edupayala Jatara | త్రినేత్ర.న్యూస్: మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గా దేవి బ్రహ్మోత్సవాలకు (Edupayala Jatara) వేలయింది. ఫివ్రవరి 15 నుంచి 17 వరకు మూడు రోజులపాటు వైభవంగా జాతర జరుగనుంది. జాతరతోపాటు మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. మంజీరా నది ఏడు పాయలుగా విడిపోయి, అమ్మవారి పాదాల చెంత నుంచి ప్రవహించే ఈ పవిత్ర క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు (ఫిబ్రవరి 15) మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు మంజీరా నది పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవారిని దర్శించుకుంటారు. రెండో రోజైన ఫిబ్రవరి 16న జాతరలోనే ప్రధాన ఘట్టమైన ‘బండ్ల ఉత్సవం’ అత్యంత కోలాహలంగా సాగనుంది. ఇక ఆఖరి రోజైన ఫిబ్రవరి 17న రథోత్సవంతో జాతర ముగియనుంది.

ఈ సందర్భంగా వనదుర్గమ్మను దర్శించుకునేందుకు మెదక్ జిల్లా నుంచే కాకుండా సంగారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్, పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సుమారు 15 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగునంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయడంతోపాటు, 150మంది గజ ఈతగాళ్లు, రెండు ఫైర్ ఇంజన్లను అందుబాటులో ఉంచనున్నారు. 5 చోట్ల మెడికల్ క్యాంప్‌లు, నాలుగు 108 అంబులెన్సులు, లక్ష ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు, 28 మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారని అధికారులు చెప్పారు. అదేవిధంగా నలుగురు డీఎస్పీలు, 23 మంది సీఐలు, 80 మంది ఎస్సైలు, 45 మంది ఏఎస్సైలు, 96 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 250 మంది కానిస్టేబుళ్లు, 84 మంది మహిళా కానిస్టేబుళ్లు, 234 మంది హోంగార్డులు, 14 మంది మహిళా హోంగార్డులతో కలిపి 829 మంది సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగించున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా బండ్ల ఉత్సవం..
మూడు రోజులపాటు జరుగనున్న జాతరలో బండ్ల ఉత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఫిబ్రవరి 16న ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి ఏడుపాయల చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో తమ ఎడ్లబండ్లను అలంకరిస్తారు. ఆలయ ప్రాంగణం చుట్టూ ఎడ్లబండ్లను ప్రదర్శనగా తిప్పుతూ మొక్కులు తీర్చుకుంటారు.
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం






