Rajanna Sircilla | కరెంటు పనుల్లోకి డ్రోన్ ఎంట్రీ.. తంగళ్లపల్లిలో వినూత్న ప్రయోగం..!
Rajanna Sircilla | ఆధునిక కాలంలో డ్రోన్ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. వ్యవసాయం నుంచి నిర్మాణ రంగం వరకు ఎన్నో రంగాల్లో కీలకంగా మారిన డ్రోన్లు.. తాజాగా పవర్ సెక్టార్‌లోనూ విస్తరిస్తున్నాయి. విద్యుత్ లైన్ల ఏర్పాటులోనూ వీటి సాయం తీసుకుంటున్నారు.
Rajanna Sircilla | ఆధునిక కాలంలో డ్రోన్ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. వ్యవసాయం నుంచి నిర్మాణ రంగం వరకు ఎన్నో రంగాల్లో కీలకంగా మారిన డ్రోన్లు.. తాజాగా పవర్ సెక్టార్‌లోనూ విస్తరిస్తున్నాయి. విద్యుత్ లైన్ల ఏర్పాటులోనూ వీటి సాయం తీసుకుంటున్నారు. నేలపై సిబ్బంది శ్రమించాల్సిన చోట.. గాల్లో డ్రోన్ తీగను మోసుకెళ్లింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మల్లప్పకుంట వద్ద ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో తొలిసారిగా విద్యుత్ లైన్ ఏర్పాటుకు డ్రోన్‌ను వినియోగించారు. సుమారు 200 మీటర్ల దూరం వరకు విద్యుత్ తీగను డ్రోన్‌తో తరలించి లైన్ పనులు చేపట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
వేగంగా.. సులువుగా..
సాధారణంగా విద్యుత్ తీగలను ఒక స్తంభం నుంచి మరో స్తంభానికి తీసుకెళ్లేందుకు సిబ్బంది శ్రమించాల్సి ఉంటుంది. వాహనాలు వెళ్లలేని ప్రాంతాలు, పొలాలు, కాలువలు, చెట్లు వంటి అడ్డంకులు ఉంటే పనులు మరింత కష్టమవుతాయి. డ్రోన్ సాయంతో తీగను గాల్లోంచే నిర్దేశిత మార్గంలోకి తీసుకెళ్లడంతో ఈ ఇబ్బందులు కొంతవరకు తగ్గుతాయి. తక్కువ సమయంలో పని పూర్తవడంతో సిబ్బంది శ్రమ, పనివేళలు తగ్గే అవకాశం ఉంది.
ప్రమాదాలు తగ్గే ఛాన్స్..
విద్యుత్ తీగలను తరలించే ప్రాథమిక పనుల్లో డ్రోన్‌ను వినియోగించడం వల్ల మానవ జోక్యం తగ్గుతుంది. దీంతో ప్రమాదాల ముప్పు కూడా కొంత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రమాదకర ప్రాంతాలు, సిబ్బంది నేరుగా వెళ్లేందుకు ఇబ్బందిగా ఉండే చోట్ల ఈ విధానం ఉపయోగకరంగా ఉంటుంది. అయితే డ్రోన్ సాయంతో తీగను తరలించినా.. తుది బిగింపు, విద్యుత్ భద్రత, లైన్ తనిఖీలను సిబ్బంది పర్యవేక్షణలోనే చేపట్టాల్సి ఉంటుంది. డ్రోన్ల వినియోగానికి వాతావరణ పరిస్థితులు కీలకం. బలమైన గాలులు, వర్షం వంటి పరిస్థితుల్లో పనులకు ఆటంకం కలిగే అవకాశాలున్నాయి. అయితే, విస్తృతంగా వినియోగిస్తే సమయం, శ్రమ, రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. విద్యుత్ పనుల్లో సాంకేతికత వినియోగానికి తంగళ్లపల్లి ప్రయోగం మరో ఉదాహరణగా నిలిచింది. ఇక ముందు విద్యుత్ లైన్ల ఏర్పాటులో డ్రోన్ల వినియోగం మరింత విస్తరిస్తుందా? చూడాలి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Mahesh Goud | కార్యకర్తల వల్లే కాంగ్రెస్‌కు అధికారం.. పార్టీ కోసం కష్టపడే వారికి పదవుల్లో ప్రాధాన్యం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- ●Harish Rao | ఆరోగ్యశ్రీపై ఎందుకంత కక్ష రేవంత్‌రెడ్డి?
- ●IOCL Recruitment | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అప్రెంటిస్‌లు.. సెప్టెంబర్ 6 వరకు దరఖాస్తులు
- ●Chiranjeevi | మెగాస్టార్ బర్త్‌డే సెలబ్రేషన్స్ - ట్రెడిషనల్ థీమ్‌తో....
- ●Indefinite Strike | అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్, స్కూల్ వ్యాన్లు బంద్..
- ●Varanasi Movie | యాభై భాషల్లో మహేష్‌బాబు వారణాసి రిలీజ్ - రాజమౌళి ప్లానింగ్ వేరే లెవెల్

Mahesh Goud | కార్యకర్తల వల్లే కాంగ్రెస్‌కు అధికారం.. పార్టీ కోసం కష్టపడే వారికి పదవుల్లో ప్రాధాన్యం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

Harish Rao | ఆరోగ్యశ్రీపై ఎందుకంత కక్ష రేవంత్‌రెడ్డి?

IOCL Recruitment | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అప్రెంటిస్‌లు.. సెప్టెంబర్ 6 వరకు దరఖాస్తులు

Chiranjeevi | మెగాస్టార్ బర్త్‌డే సెలబ్రేషన్స్ - ట్రెడిషనల్ థీమ్‌తో....





