Etala Rajendar | రేవంత్‌కు సోయి లేకనే తాగునీటి కష్టాలొచ్చినయ్
Etala Rajendar | సీఎం రేవంత్‌రెడ్డికి సోయి లేకనే హైదరాబాద్ (Hyderabad)కు తాగునీటి (Drinking Water) కష్టాలొచ్చాయని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajendar) విమర్శించారు.
- సోనియా, రాహుల్‌కు మూటలు పంపేదానిపై ఉన్న ఇంట్రెస్ట్ ప్రజల మీద లేదు
- సోనియా పుస్తకంలో అబద్ధాలు రాశారు
- రాహులేమో దేశంలో అల్లర్లు జరగాలని కోరుకుంటుండు.. ఖబర్దార్ రాహుల్
- సీఎం రేవంత్, రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ధ్వజం
Etala Rajendar | త్రినేత్ర న్యూస్: సీఎం రేవంత్‌రెడ్డికి సోయి లేకనే హైదరాబాద్ (Hyderabad)కు తాగునీటి (Drinking Water) కష్టాలొచ్చాయని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajendar) విమర్శించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మూటలు పంపేదాని మీదున్న ఇంట్రెస్ట్ తెలంగాణ ప్రజల మీద లేదన్నారు. సోనియా పుస్తకంలో అబద్ధాలు రాస్తే.. రాహులేమో దేశంలో అల్లర్లు జరగాలని కోరుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీని విమర్శిస్తే సహించమని తేల్చి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. రాహుల్‌కు పార్లమెంట్లో మాట్లాడడం చేతకాదన్నారు.
ఎల్‌నినో ముప్పును పట్టించుకోలే
"రాబోయే కాలంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని, కరువు పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడతారని ఏడాది ముందే శాస్త్రవేత్తలు, అంతర్జాతీయ వ్యవస్థలు హెచ్చరించాయి. దీనిపై నేనే స్వయంగా తొలి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాను. 'రేవంత్ రెడ్డి గారూ.. మీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ మీ కాళ్లు మాత్రం తంగేళ్లు దాటడం లేదు. భూమి మీద ఉండి ఆలోచించండి' అని హితవు పలికాను. రాబోయే తాగు, సాగునీటి , భూగర్భ జలాలు అడుగంటిపోవడం, కరెంటు సమస్యలపై ముందుగానే ఆలోచించాలని కోరాను. కేసీఆర్ మీద కోపం ఉంటే ఉండొచ్చు, కానీ ఆ కోపంతో తెలంగాణ రైతాంగాన్ని శిక్షించవద్దని కోరినా పట్టించుకోలేదు. ఫలితంగా ఇవాళ హైదరాబాద్ నగరంలోనూ, రాష్ట్రవ్యాప్తంగా తాగునీరు లేక, బోర్లు-బావులు ఎండుకుపోయి హాస్టల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు" అని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు.
వడ్ల కొనుగోలు కేంద్రాల్లో వసతులే లేవ్
పంటలు ఎండిపోయినప్పటికీ, చేతికి వచ్చిన కాస్త ధాన్యాన్ని అమ్ముకోవడానికి వెళ్తే వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేవని ఈటల మండిపడ్డారు. "కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసినా గన్నీ బస్తాలు లేవు, హమాలీ వ్యవస్థ లేదు, కాంటాలు లేవు, తార్పాలిన్లు లేవు. కనీస ధర్మంగా అఖిలపక్ష సమావేశం పెట్టి రైతాంగ సమస్యలపై చర్చించాల్సిన సంస్కారం కూడా సీఎంకు లేదు. 'నాకు తెలవదా.. అన్నీ నేనే చేస్తా' అనే అహంకార ధోరణితో వ్యవహరిస్తూ రైతులను రోడ్డున పడేశారు" అని ధ్వజమెత్తారు.
రాహుల్ దేశ పరువు తీస్తున్నరు
నిరుద్యోగులను మోసం చేసి, ప్రైవేట్ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులను పట్టించుకోని ప్రభుత్వం.. 'ప్రోగ్రెసివ్ అలయన్స్' పేరుతో హైదరాబాద్‌లో కాంక్లేవ్ నిర్వహించడాన్ని ఈటల తప్పుబట్టారు. "ఈ సమ్మిట్ పరిశ్రమల స్థాపనకో, నిరుద్యోగ సమస్య పరిష్కారానికో కాదు. మోదీ, సుప్రీంకోర్టు, ఈసీ వంటి వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ప్రపంచ దేశాల ముందు భారత్ ప్రతిష్టను, గౌరవాన్ని మట్టి కలిపేందుకే రాహుల్ గాంధీ ఈ కార్యక్రమం నిర్వహించారు. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి అప్పోజిషన్ లీడర్‌గా ఉండి రాహుల్ మాట్లాడుతున్న తీరు చూసి భారత జాతి సిగ్గుతో తలదించుకుంటోంది. పార్లమెంట్లో మాట్లాడే సత్తా లేక, వాస్తవాలు ధైర్యంగా చెప్పలేక బయట అబద్ధాలతో అశాంతిని సృష్టించాలనే నీచమైన ఆలోచన చేస్తున్నారు" అని మండిపడ్డారు. శ్రీలంక, నేపాల్, అఫ్గానిస్తాన్ తరహాలో దేశంలో అల్లర్లు జరగాలని కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారని, కానీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలందరూ ప్రధాని మోదీ నాయకత్వంలోనే సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అంటేనే స్కాములు
సోనియా గాంధీ పుస్తకావిష్కరణ, కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై స్పందిస్తూ.. "జవహర్ లాల్ నెహ్రూ కాలంలోనే ఎల్ఐసి కుంభకోణం, మిలటరీ జీపుల కొనుగోళ్ల స్కామ్ జరిగాయి. బోఫోర్స్ నుంచి 2G, కోల్ స్కామ్ వరకు.. సొంత మంత్రులే జైలుకు వెళ్లిన చరిత్ర కాంగ్రెస్‌ది. మోదీ గారి 12 ఏళ్ల పాలనలో ఎక్కడా చిన్న మచ్చ కూడా లేకుండా దేశం గర్వపడేలా పాలన సాగుతుంటే, గుడ్డి ద్వేషంతో, అధికారం కోల్పోతామనే డెస్పరేషన్లో కాంగ్రెస్ నాయకులు పిచ్చి పనులు చేస్తున్నారు" అని విమర్శించారు. దేశంలో ప్రస్తుతం కేవలం నాలుగు రాష్ట్రాలకే (కేరళ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ) కాంగ్రెస్ పరిమితమైందని, కర్ణాటక, తెలంగాణల్లో 30-40% ప్రభుత్వాలు నడుస్తున్నాయని, హిమాచల్ ప్రదేశ్‌లో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.
మీ ప్రభుత్వం ‘గాన్ కేస్’..
"హైదరాబాద్‌కు వచ్చి మోదీని, దేశ ప్రతిష్టను భంగపరిచే ప్రయత్నం చేస్తే ఖబర్దార్! రేవంత్ రెడ్డి గారూ.. మీ ప్రభుత్వం గాన్ కేస్ (అవుట్). 2028 ఎన్నికల్లో మీ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. ఉన్నన్ని రోజులు ఇచ్చిన హామీలు ఏంటో, ఏం చేస్తారో చెప్పండి తప్ప ఇట్లాంటి దిగజారుడు రాజకీయాలు చేయవద్దు. బీజేపీ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై కొట్లాడి, తగిన విధంగా బుద్ధి చెప్పే సత్తా భారతీయ జనతా పార్టీకి ఉంది. వెంటనే వాస్తవంలోకి వచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించే మార్గం చూడాలి" అని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
ఈ మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కర్ణాటక రాష్ట్రం సహా ప్రభారి కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్, మాజీ అధ్యక్షులు పాశం భాస్కర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రచ్చ శ్రీను, మండల అధ్యక్షులు గుంటిపల్లి సత్యం, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కర్రె ప్రవీణ్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి ప్రసాద్, మహేష్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Telangana Indiramma Houses | 7 లక్షల ఇందిరమ్మ ఇండ్ల పట్టాలకు తనఖా నుంచి విముక్తి
- ●Kavitha | పవర్‌స్టార్‌ది వారాహి అయితే.. నాది ‘భైరవ’ యాత్ర
- ●Indian Liqueur Brands | దేశీ రుచులతో గ్లోబల్ బ్రాండ్లకు భారత లిక్కర్ కంపెనీల సవాల్!
- ●MLA Sudheer Reddy | రేవంత్ చెప్పింది నమ్మాల్నా.. ఉత్తమ్ చెప్పిందా?
- ●Kalyan Banerjee Chhath Puja Remarks | పశ్చిమ బెంగాల్ బెంగాలీలదా, లేక బీహారీలదా?
- ●Teja Sajja | సందడిగా తేజా సజ్జా ఎంగేజ్మెంట్ - కాబోయే భార్య పేరు చెప్పేసిన హనుమాన్ హీరో

Telangana Indiramma Houses | 7 లక్షల ఇందిరమ్మ ఇండ్ల పట్టాలకు తనఖా నుంచి విముక్తి

Kavitha | పవర్‌స్టార్‌ది వారాహి అయితే.. నాది ‘భైరవ’ యాత్ర

Indian Liqueur Brands | దేశీ రుచులతో గ్లోబల్ బ్రాండ్లకు భారత లిక్కర్ కంపెనీల సవాల్!

MLA Sudheer Reddy | రేవంత్ చెప్పింది నమ్మాల్నా.. ఉత్తమ్ చెప్పిందా?



