త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Deshapathi Srinivas | ఆంధ్రజ్యోతి కథనాలపై ‘సిట్’ విచారణ జరిపించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా: ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్

Deshapathi Srinivas | ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనాలపై సిట్ విచార‌ణ జ‌రిపించే ద‌మ్ము ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy)కి ఉందా అని ఎమ్మెల్సీ (MLC) దేశ‌ప‌తి శ్రీ‌నివాస్ (Deshapathi Srinivas) ప్ర‌శ్నించారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే వెంటనే సిట్ ఏర్పాటు చేసి, సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలను నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు.

A

Telangana | Published On Jan 18, 2026, 3.49 pm IST

Deshapathi Srinivas | ఆంధ్రజ్యోతి కథనాలపై ‘సిట్’ విచారణ జరిపించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా: ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
Advertisement

Deshapathi Srinivas | త్రినేత్ర‌.న్యూస్‌ : ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనాలపై సిట్ విచార‌ణ జ‌రిపించే ద‌మ్ము ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy)కి ఉందా అని ఎమ్మెల్సీ (MLC) దేశ‌ప‌తి శ్రీ‌నివాస్ (Deshapathi Srinivas) ప్ర‌శ్నించారు. రేవంత్‌కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఎన్టీవీలో ప్రసారమైన కథనాలపై విచారణకు సిట్ ఎలా అయితే నియమించారో, అలాగే వేమూరి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనాలపై కూడా తక్షణమే సిట్ వేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్, వేమూరి రాధాకృష్ణ మ‌ధ్య సాన్నిహిత్యం అందరికీ తెలిసిందేన‌ని అన్నారు. ఆయన పుట్టినరోజున స్వయంగా ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపే ముఖ్యమంత్రి.. వార్త రాసే ముందు తనను వివరణ అడగాలి అని మెత్తటి మాటలతో సరిపుచ్చడం హాస్యాస్పదంగా ఉంద‌న్నారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే... కేవలం మాటలకే పరిమితం కాకుండా, వెంటనే సిట్ ఏర్పాటు చేసి, సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలను నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. చట్టప్రకారం దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement