Talasani Srinivas Yadav | సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పోరాటం తప్పదు: మాజీ మంత్రి తలసాని
Talasani Srinivas Yadav | సికింద్రాబాద్ (Secunderabad) అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పోరాటం తప్పదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తుగ్లక్ పాలన చేస్తూ పేర్లు మార్పు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
త్రినేత్ర.న్యూస్: సికింద్రాబాద్ (Secunderabad) అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పోరాటం తప్పదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తుగ్లక్ పాలన చేస్తూ పేర్లు మార్పు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన శాంతి ర్యాలీకి మొదట అనుమతి ఇచ్చిన పోలీసులు రాత్రి 10.40కి దానిని రద్దు చేశారని ఆరోపించారు. సికింద్రాబాద్ పేరు మార్చడం లేదని చెబుతూనే మల్కాజిగిరి కార్పొరేషన్‌ను రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారని మండిపడ్డారు.
రెండేళ్లుగా ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని చెప్పారు. తుగ్లక్ పాలన చేస్తూ పేర్లు మార్పు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పోరాటం తప్పదని, ర్యాలీని అడ్డుకునేందుకు నిన్న ఎన్ని విధాలుగా ప్రయత్నించినా వాళ్లు విఫలమయ్యారని, తాము సక్సెస్ అయ్యామని చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారంలో కోర్టు అనుమతితో వేలాది మందితో సికింద్రాబాద్ కోసం ర్యాలీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. కలిసి వచ్చే పార్టీలు కలిసి రావాలని కోరామని తెలిపారు. ఈసారి జరిగే ర్యాలీని ఎవరూ అడ్డుకోలేని విధంగా నిర్వహిస్తామని వెల్లడించారు. తమ రక్తంలోనే భయమన్న మాట లేదని, కేసులకు భయపడేది లేదని హెచ్చరించారు.
సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం బీఆర్‌ఎస్ పోరుబాట పట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తలసాని ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు శనివారం భారీ శాంతి ర్యాలీకి పిలుపునిచ్చింది. అయితే.. ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

Revanth Reddy | కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలి: సీఎం రేవంత్
మే 21, 2026
తాజావార్తలు
- ●Horoscope | మే 22, శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Horoscope | మే 22, శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్



