త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nora Fatehi | భూష‌ణ్ కుమార్‌తో డేటింగ్ వార్త‌లు.. ఎట్ట‌కేల‌కు స్పందించిన నోరా ఫ‌తేహి..!

Nora Fatehi | టీ సిరీస్ అధినేత భూష‌ణ్ కుమార్‌తో డేటింగ్ చేసిన‌ట్లుగా వ‌చ్చిన వార్త‌ల‌పై ఎట్ట‌కేల‌కు బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫ‌తేహి ఎట్ట‌కేల‌కు స్పందించింది. వీరిద్ద‌రి మ‌ధ్య సంథిగ్ సంథిగ్ న‌డుస్తుందంటూ అప్ప‌ట్లో వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. తాజాగా మ‌రోసారి వార్త‌లు వైర‌ల్ కావ‌డంతో ఈ బ్యూటీ ఎట్ట‌కేల‌కు స్పందించింది.

P

Entertainment | Published On Jan 18, 2026, 5.35 pm IST

Nora Fatehi | భూష‌ణ్ కుమార్‌తో డేటింగ్ వార్త‌లు.. ఎట్ట‌కేల‌కు స్పందించిన నోరా ఫ‌తేహి..!
Advertisement

Nora Fatehi | టీ సిరీస్ అధినేత భూష‌ణ్ కుమార్‌తో డేటింగ్ చేసిన‌ట్లుగా వ‌చ్చిన వార్త‌ల‌పై ఎట్ట‌కేల‌కు బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫ‌తేహి ఎట్ట‌కేల‌కు స్పందించింది. వీరిద్ద‌రి మ‌ధ్య సంథింగ్ సంథింగ్ న‌డుస్తుందంటూ అప్ప‌ట్లో వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. తాజాగా మ‌రోసారి వార్త‌లు వైర‌ల్ కావ‌డంతో ఈ బ్యూటీ ఎట్ట‌కేల‌కు స్పందించింది.

ఐదేళ్ల నాటి సోష‌ల్ మీడియా వీడియోలో ఓ యువ‌తి నోరా ఫ‌తేహి, భూష‌ణ్ కుమార్‌కు మ‌ధ్య ఎఫైర్ చ‌ర్చించింది. ఈ పోస్ట్‌లో నోరా ఫతేహి ల‌గ్జ‌రీ లైఫ్‌ని అనుభ‌విస్తుంద‌ని, ఆమె వాడుతున్న ల‌గ్జ‌రీ కార్లు, బ్రాండెడ్ బ్యాగ్స్, బ‌ట్ట‌లు ఆమె ఎలా కొంటుంది..? అంటూ ప్ర‌శ్నించింది. ఆమె వెనుక భూష‌ణ్ కుమార్ ఉన్నార‌ని.. వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న రిలేష‌న్ కార‌ణంగా టీ-సిరీస్ నుంచి వరుస ఆఫర్లు వస్తున్నాయంటూ ఆరోపించారు. తాజాగా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ రెడ్డిట్ పోస్ట్ స్క్రీన్‌షాట్‌ను షేర్‌ చేసింది.

ఇది చూసిన నోరా వావ్ అంటూ స్మైలీ ఎమోజీ  నోరా జోడించి.. పెట్టి రూమ‌ర్స్‌కు చెక్ పెట్టింది. పాత రూమ‌ర్స్‌పై ఈ బ్యూటీ స్పందించ‌డం బాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నోరా త‌న కెరీర్‌లో అనేక హిట్ సాంగ్స్ చేసింది. ఇందులో చాలా వ‌ర‌కు భూష‌ణ్ కుమార్ కంపెనీ టీ సిరీస్‌తోనే క‌లిసి చేసింది. కంపెనీతో ఆమెకు మంచి అనుబంధం ఉంది. నోరా గ‌తేడాది జ‌మైక‌న్ సింగ‌ర్‌తో క‌లిసి ఓ సాంగ్ చేసింది. సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

ఇదిలా ఉండ‌గా.. భూష‌ణ్ కుమార్ 2005లో న‌టి దివ్య ఖోస్లాను పెళ్లి చేసుకున్నారు. వీరిద్ద‌రికి కొడుకు ఉన్నాడు. త‌న‌పై వ‌చ్చిన రూమ‌ర్స్‌పై మాత్రం భూష‌ణ్ కుమార్ స్పందించ‌లేదు. అయితే, నోరా ఫతేహి ప‌లువురితో డేటింగ్‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇటీవ‌ల మొరాకో ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ హ‌కీమీతో రిలేష‌న్‌లో ఉన్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. ఇదిలా ఉండ‌గా.. నోరా సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం రెండు సినిమాల్లో న‌టిస్తున్న‌ది. క‌న్న‌డ మూవీ ది: డేవిల్‌తో పాటు త‌మిళ మూవీ కాంచ‌న‌-4లో కీల‌క‌పాత్ర పోషిస్తున్న‌ది.

Advertisement

తాజావార్తలు

Advertisement