త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bigg Boss Winner | ఫైన‌ల్‌కు ముందే త‌మిళ బిగ్‌బాస్ విన్న‌ర్ పేరు లీక్ – దివ్య గ‌ణేష్‌కు టైటిల్ – తెలుగులోనూ ఫేమ‌స్‌!

త‌మిళ బిగ్‌బాస్ సీజ‌న్ 9 విన్న‌ర్ ఎవ‌ర‌న్న‌ది ఫైన‌ల్‌కు ముందే లీక‌య్యింది. దివ్య గ‌ణేష్ టైటిల్ గెలుచుకున్న‌ట్లుగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. దివ్య గ‌ణేష్ త‌మిళంలో కంటే తెలుగులో ఎక్కువ‌గా సినిమాలు, సీరియ‌ల్స్ చేసింది.

N

Entertainment | Published On Jan 18, 2026, 5.30 pm IST

Bigg Boss Winner | ఫైన‌ల్‌కు ముందే త‌మిళ బిగ్‌బాస్ విన్న‌ర్ పేరు లీక్ – దివ్య గ‌ణేష్‌కు టైటిల్ – తెలుగులోనూ ఫేమ‌స్‌!
Advertisement

Bigg Boss Winner |  త‌మిళ బిగ్‌బాస్ సీజ‌న్ 9 ఫైన‌ల్ ఆదివారం (నేడు) జ‌రుగ‌నుంది. విజ‌య్ సేతుప‌తి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ సీజ‌న్ 105 రోజుల పాటు అనేక మ‌లుపుల‌తో ఉత్కంఠ‌గా సాగింది. మొత్తం 24 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌గా అందులో నుంచి న‌లుగురు ఫైన‌ల్ చేరుకున్నారు. దివ్య గ‌ణేష్‌, విక్ర‌మ్‌, శ‌బ‌రినాథ‌న్‌తో పాటు అరోరా ఫైన‌ల్‌లోకి అడుగుపెట్టారు.

విన్న‌ర్ పేరు లీక్‌...

ఈ న‌లుగురిలో విన్న‌ర్ ఎవ‌ర‌న్న‌ది లీక‌య్యింది. దివ్య గ‌ణేష్ టైటిల్ గెలుచుకుంది. దివ్య గ‌ణేష్ బిగ్‌బాస్ టైటిల్‌ను ద‌క్కించుకున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు క‌నిపిస్తున్నాయి. అంతే కాకుండా వీకిపీడియాలో దివ్య గ‌ణేష్ పేరు ప‌క్క‌న విన్న‌ర్ అంటూ క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. శ‌బ‌రినాథ‌న్ ఫ‌స్ట్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన‌ట్లు వీకిపీడియా పేర్కొన్న‌ది. అరోరా, విక్ర‌మ్ త‌ర్వాత స్థానాల్లో నిలిచార‌ట‌.

తెలుగులో ఫేమ‌స్‌...

త‌మిళ బిగ్‌బాస్ విన్న‌ర్‌గా నిలిచిన దివ్య గ‌ణేష్ గురించి నెటిజ‌న్లు తెగ వెతుకుతున్నారు. సీరియ‌ల్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన దివ్య గ‌ణేష్ సినిమాలు కూడా చాలానే చేసింది. త‌మిళంలోనే కంటే తెలుగులోనే ఆమె చేసిన సీరియ‌ల్స్‌, సినిమాలు ఎక్కువ‌గా ఫేమ‌స్ అయ్యాయి. ఖిలాడీ క‌న్మ‌ణి అనే త‌మిళ సీరియ‌ల్‌తో దివ్య గ‌ణేష్ యాక్టింగ్ జ‌ర్నీ మొద‌లైంది. త‌మిళంలో భాగ్య‌ల‌క్ష్మి, చెల్ల‌మ్మ‌, విన్నైతాండి వ‌రువాయాతో పాటు మ‌రికొన్ని సీరియ‌ల్స్ తో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఆ త‌ర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దివ్య గ‌ణేష్‌...భాగ్య‌రేఖ‌, బంగారు పంజ‌రం అనే సీరియ‌ల్స్‌లో న‌టించింది.

హీరోయిన్‌గా...

సీరియ‌ల్స్ మాత్ర‌మే కాకుండా ఒక క్రిమిన‌ల్ ప్రేమ‌క‌థ‌, కీ, గ్లాస్‌, నిను వీడ‌ని నీడ‌ను నేనుతో పాటు మ‌రికొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా, ఇంపార్టెంట్ రోల్స్‌లో క‌నిపించింది. దివ్య గ‌ణేష్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన హార్ట్‌బీట్ అనే త‌మిళ సిరీస్ తెలుగులో విడుద‌లై ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. దివ్య గ‌ణేష్ త‌మిళ బిగ్‌బాస్ టైటిల్ గెల‌వ‌డంతో తెలుగు ఫ్యాన్స్ ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. వైల్డ్ కార్డ్‌గా బిగ్‌బాస్ త‌మిళ సీజ‌న్ 9లోకి ఎంట్రీ ఇచ్చిన దివ్య గ‌ణేష్ టైటిల్ విన్న‌ర్‌గా గ‌మ‌నార్హం. దివ్య గ‌ణేష్‌కు 30 ల‌క్ష‌ల‌కుపైనే ప్రైజ్‌మ‌నీ ద‌క్క‌నున్న‌ట్లు స‌మాచారం.

 

Advertisement

తాజావార్తలు

Advertisement