IND Vs NZ | రాజ్‌కోట్ వన్డేలో చెలరేగిన న్యూజిలాండ్ బ్యాటర్లు.. టీమిండియా టార్గెట్ 338 రన్స్
IND Vs NZ | రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో టీమిండియాకు న్యూజిలాండ్ 338 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియాకు తొలుత బౌలర్లు శుభారంభం అందించారు.
IND Vs NZ | రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో టీమిండియాకు న్యూజిలాండ్ 338 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియాకు తొలుత బౌలర్లు శుభారంభం అందించారు. ఒక దశలో 58 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడ్డ న్యూజిలాండ్ జట్టును డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ ఆదుకున్నారు. ఇద్దరు శతకాల మోత మోగించడంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది.
మిచెల్ 131 బంతుల్లో 15 ఫోర్లు, మూడు సిక్సర్లతో 137 పరుగులు, ఫిలిప్స్ 88 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లతో 106 పరుగులతో రాణించారు. ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 188 బంతుల్లో 219 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇద్దరు క్రీజులో కుదురుకోవడంతో ఆ జట్టు భారీ స్కోర్ సాధించగలిగింది. ఆ తర్వాత ఇద్దరు అవుట్ అవడంతో కాస్త స్కోర్ తగ్గింది. చివరలో కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ సైతం విరుచుకుపడడంతో స్కోర్ 330 పరుగులు దాటింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో మూడు వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.
సంబంధిత వార్తలు

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026

ICC Women’s T20 World Cup | టీ20 వరల్డ్ కప్‌కు భారత్ జట్టు ప్రకటన.. యువ ఫాస్ట్ బౌలర్ నందినికి ఛాన్స్..!
మే 2, 2026

ICC Test Rankings | ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. మూడో స్థానానికి భారత్
మే 1, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



