త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | వెలుగుమ‌ట్ల బాధితుల‌కు న్యాయం చేయండి: గ‌వ‌ర్న‌ర్‌కు క‌విత విన‌తి

Kavitha | ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను కోరినట్లు తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కవిత తెలిపారు. ఇళ్లు కోల్పోయిన బాధితులందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని కోరామ‌న్నారు.

S

Telangana | Published On May 26, 2026, 3.39 pm IST

Kavitha | వెలుగుమ‌ట్ల బాధితుల‌కు న్యాయం చేయండి: గ‌వ‌ర్న‌ర్‌కు క‌విత విన‌తి
Advertisement
  • రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై గ‌వ‌ర్న‌ర్‌కు అన్ని వివ‌రాలు అందించాం
  • ఆయ‌న‌ ఆశ్చ‌ర్యానికి గురయ్యారు
  • ప్ర‌తిస్పందిస్తార‌ని అనుకుంటున్నాం
  • లేదంటే మ‌ళ్లీ పోరుబాట త‌ప్ప‌దు

Kavitha | త్రినేత్ర‌.న్యూస్: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను కోరినట్లు తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కవిత తెలిపారు. లోక్‌భవన్‌లో మంగ‌ళ‌వారం వెలుగుమట్ల, వికారాబాద్‌ జిల్లా కడ్లాపూర్‌, ట్రిపుల్‌ ఆర్‌ బాధితులతో కలిసి గవర్నర్‌ను కలిశామని ఆమె చెప్పారు. అనంత‌రం ధ‌ర్మ‌సమాజ్ పార్టీ అధ్యక్షుడు విషార‌ద‌న్ తో క‌లిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు.

వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన బాధితులందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని కోరాం. కడ్లాపూర్‌లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు జారీ చేసిన భూసేకరణ నోటీసులను రద్దు చేయాలి. ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్పు తదితర సమస్యలపై బాధితులతో కలిసి గవర్నర్‌కు వినతిపత్రం అందజేశాం. పరిగిలో ఇండస్ట్రియల్ పార్కుకు ఇచ్చిన భూసేకరణ నోటీసు రద్దు చేయాలి. న్యాయం జరగకపోతే మళ్లీ పోరాట బాట పడతాం క‌విత చెప్పారు.

చేప‌పిల్ల‌లాగా త‌ల్ల‌డిల్లుత‌డు..

ఇప్ప‌టివ‌ర‌కు తాము బాధితుల త‌ర‌ఫున కొట్లాడిన ఘ‌ట‌న‌ల‌ను పాక్షిక విజ‌యాలుగా భావిస్తున్నాం. సంపూర్ణ విజ‌యం రావాలంటే ఇందులో కేంద్ర ప్ర‌భుత్వం జోక్యం ఉండాలి. ఈరోజు బాధితులంతా ఇక్క‌డికి వ‌చ్చారు. భూమి కోల్పోయిన రైతు నీళ్ల‌లో నుంచి బ‌య‌ట‌కొచ్చిన చేప‌పిల్ల‌లాగా త‌ల్ల‌డిల్లుత‌డు. యావ‌త్ స‌మాజం పేద‌లు, బాధితుల ప‌క్షాన నిల‌బ‌డాలి అని ఆమె కోరారు.

వెలుగుమ‌ట్ల నుంచి నివేదిక తెప్పించుకుంటాన‌ని గ‌వ‌ర్న‌ర్ చెప్పారు. ప‌రిగి విష‌యంలో కూడా ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రితో మాట్లాడతాన‌ని అన్నారు. రాయ‌గిరి నుంచి ఆర్ఆర్ఆర్ వెళ్లొద్ద‌ని కిష‌న్‌రెడ్డి ఇచ్చిన లెట‌ర్‌ను కూడా చూపించాం. అలైన్‌మెంట్ మార్చిన వివ‌రాల‌ను కూడా స‌మ‌ర్పించాం. ఇవ‌న్నీ చూసి గ‌వ‌ర్న‌ర్ కొంత ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. అందుకే మేం ఆశావహంగా ఉన్నాం. ప్ర‌తిస్పందిస్తార‌ని అనుకుంటున్నాం. ఎక్కాల్సిన మెట్లు ఎక్కుతాం, త‌ట్టాల్సిన డోర్లు త‌డ‌తాం. ప్ర‌జ‌లకు మేలు జ‌రిగితే స‌రే. లేదంటే పోరాటం త‌ప్ప‌దు. నవ్య‌లాగ ఎంతో మంది ఇండ్లను కోల్పోయారు. రూ.100 విలువైన‌ చీర‌లు ఇచ్చి కోటి మంది ఆడ‌బిడ్డ‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేస్తాన‌ని సీఎం రేవంత్ ప‌చ్చి అబ‌ద్దాలు చెబుతున్నారు. మా బిడ్డ‌ల‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు పోరాటం చేస్తాం.

ధాన్యం కొన‌కుంటే జిల్లా స్థాయిల్లో నిర‌స‌న‌ల‌కు దిగుతాం..

విమానం ఎక్కి ఢిల్లీకి వెళ్లే ముఖ్య‌మంత్రి క‌ల్లాల‌ల్ల ధాన్యం క‌న‌బ‌డ‌ది క‌దా.. అందుకే కల్లాల్లో ధాన్యం లేద‌ని అనుకుంటున్నారు. దిగి కాలిన‌డ‌క‌న‌ న‌డిస్తే వాస్త‌వాలు తెలుస్త‌యి. సీఎం అబ‌ద్దాలు మానేసి వాస్త‌వాలు తెలుసుకోవాలి. వాన‌లు ప‌డితే రైతులు ఆగ‌మైత‌రు. అందుకే మొన్న స‌చివాల‌యం ముందు వ‌డ్లు పోసి నిర‌స‌న తెలిపాం. రాష్ట్రంలో ఎక్క‌డ చూసినా రైతుల ప‌రిస్థితి బాలేదు. ప్ర‌భుత్వం సీరియ‌స్ గా తీసుకోకుంటే జిల్లా స్థాయిలో నిర‌స‌న‌ల‌కు దిగుతాం అని క‌విత హెచ్చరించారు.

రాష్ట్రంలో రాజ్యాంగ వ్య‌తిరేక పాల‌న‌: విషార‌ద‌న్, ధ‌ర్మ‌సమాజ్ పార్టీ అధ్యక్షుడు 

ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఎవ‌రికీ చెప్పినా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌డం లేదు. గ‌వ‌ర్న‌ర్ ఒక్క‌రే స‌మ‌స్య‌ల‌ ప‌రిష్కార క‌ర్త. అందుకే ఇక్క‌డికి వ‌చ్చాం. సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగానికి వ్య‌తిరేకంగా ప‌రిపాలిస్తుండు. ల‌క్ష ఎక‌రాల భూముల‌ను కొల్ల‌గొట్టేందుకు ప‌థ‌కం ప‌న్నిండు. ఆ భూముల‌ను కాపాడాలి. ఇదే విష‌యాన్ని గ‌వ‌ర్న‌ర్‌కు విన్న‌వించాం. స‌మ‌స్య ప‌రిష్కారమవుతుంద‌ని ఆశిస్తున్నాం. లేదంటే తెలంగాణ‌లో అతిపెద్ద యుద్ధానికి దారి తీస్తాం. రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న భూముల వివ‌రాలు సేక‌రిస్తున్నాం. ఎక్క‌డెక్క‌డ దోపిడీకి గుర‌వుతున్నాయే తెలుసుకొని పోరాటం చేస్తాం. అతిపెద్ద మ‌హాస‌భ పెట్ట‌డానికి కూడా ప్ర‌ణాళిక ర‌చిస్తున్నాం.

 

Advertisement

తాజావార్తలు

Advertisement