త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLAs Disqualification | బ్యాంకు స్టేట్‌మెంట్ల‌తోనే.. ఆ ఐదుగురు ఎమ్మెల్యేల‌కు ఊర‌ట‌

MLAs Disqualification | బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేలకు శాస‌న‌స‌భ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

S

Telangana | Published On Dec 17, 2025, 5.22 pm IST

MLAs Disqualification | బ్యాంకు స్టేట్‌మెంట్ల‌తోనే.. ఆ ఐదుగురు ఎమ్మెల్యేల‌కు ఊర‌ట‌
Advertisement

MLAs Disqualification | హైద‌రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేలకు శాస‌న‌స‌భ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, తెల్లం వెంక‌ట్రావ్, బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి, ప్ర‌కాశ్ గౌడ్, గూడెం మ‌హిపాల్ రెడ్డిపై అన‌ర్హ‌త వేటు వేసేందుకు స్పీక‌ర్ నిరాక‌రించారు. ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు ఎక్క‌డా ఆధారాలు లేవ‌ని స్పీక‌ర్ పేర్కొన్నారు. అన‌ర్హ‌త వేటుకు త‌గిన ఆధారాలు లేవ‌ని, సాంకేతికంగా ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్న‌ట్టు స్పీక‌ర్ త‌న తీర్పులో వెలువ‌రించారు.

కీల‌క‌మైన కేసీఆర్ ఫొటోలు, బ్యాంకు స్టేట్‌మెంట్లు..!

ఈ ఐదుగురు ఎమ్మెల్యేల‌ను స్పీక‌ర్ మూడు ద‌ఫాలుగా విచారించారు. అది కూడా పిటిష‌నర్ల అడ్వ‌కేట్ల ముందు విచార‌ణ సాగింది. అఫిడ‌విట్ రూపంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు స‌మాధానం ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా తాము పార్టీ మార‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోస‌మే సీఎంను క‌లిశామ‌ని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేల క్యాంపు కార్యాల‌యాల్లో కేసీఆర్ ఫొటోలు ఉన్న ఆధారాల‌ను స్పీక‌ర్‌కు స‌మ‌ర్పించారు. దీంతో పాటు ప్రతినెలా జీతం నుంచి పార్టీ ఫండ్ కట్ అవుతున్న బ్యాంక్ స్టేట్‌మెంట్‌ని కూడా ఎమ్మెల్యేలు స్పీక‌ర్‌కు స‌మ‌ర్పించారు. వీట‌న్నింటితో స్పీక‌ర్ ఏకీభ‌వించారు. త‌ద‌నంత‌రం వారి అన‌ర్హ‌త పిటిష‌న్ల‌ను స్పీక‌ర్ తోసిపుచ్చారు.

Advertisement

తాజావార్తలు

Advertisement