DGP Shivadhar Reddy | మీరు కూడా లొంగిపోండి.. గణపతికి డీజీపీ శివధర్ రెడ్డి పిలుపు
DGP Shivadhar Reddy | మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత భారత్‌గా ఈ దేశాన్ని మార్చుతామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పలు సందర్భాల్లో పలు వేదికలపై బహిరంగ ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే.
DGP Shivadhar Reddy | త్రినేత్ర.న్యూస్ : మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత భారత్‌గా ఈ దేశాన్ని మార్చుతామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పలు సందర్భాల్లో పలు వేదికలపై బహిరంగ ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు.. మావోయిస్టులతో కీలక సంప్రదింపులు జరిపి లొంగిపోయేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికీ తెలంగాణకు చెందిన మరో ఆరుగురు మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోలేదు. దీంతో కేంద్రం ప్రకటించిన డెడ్‌లైన్ మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు.
ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియాస్ గణపతి(72)తో పాటు మిగిలిన ఐదుగురు మావోయిస్టులు కూడా లొంగిపోవాలని డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. పుసునూరి నరహరి అలియాస్ సంతోష్(57), వార్త శేఖర్ అలియాస్ మంగ్తు(51), జోడే రత్నభాయి అలియా సుజాత(68), నక్క సుశీలా అలియాస్ రేలా(51), రంగబోయిన భాగ్య అలియాస్ రూపి(43) స్వచ్ఛందంగా లొంగిపోవాలని, గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపాలని డీజీపీ సూచించారు.
గత రెండేండ్ల నుంచి మావోయిస్టుల లొంగుబాటుకు అనేక చర్యలు తీసుకున్నామని, మొత్తానికి సఫలీకృతులమయ్యామని డీజీపీ తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ముందు 721 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన వారని పేర్కొన్నారు. లొంగిపోయిన వారిలో నలుగురు సెంట్రల్ కమిటీ మెంబర్లు, స్టేట్ కమిటీ మెంబర్లు 19 మంది, డివిజనల్ కమిటీ మెంబర్లు 36 మంది ఉన్నారని తెలిపారు.
లొంగిపోయిన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర పునరావాస విధానం కింద ఆర్థిక సహాయం, ఇతర ప్రయోజనాలు కల్పించిందన్నారు. తద్వారా వారు తమ స్వగ్రామాల్లో గౌరవప్రదమైన జీవితాలను గడిపేందుకు వీలు కలిగిందని డీజీపీ స్పష్టం చేశారు. కేంద్ర కమిటీ సభ్యుడు గణపతి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తమకు సమాచారం ఉందని, ఆయనకు హైదరాబాద్‌లో అత్యాధునిక వైద్య చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



