త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

STHREE RIDE | ‘స్త్రీ రైడ్’ కార్య‌క్ర‌మం ప్రారంభం.. మహిళా సాధికార‌త‌కు అత్యంత ప్రాధాన్యం

STHREE RIDE | మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన స్త్రీ రైడ్ కార్యక్రమాన్ని డీజీపీ సీవీ ఆనంద్ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్లు పాల్గొన్నారు.

S

Telangana | Published On Jun 7, 2026, 2.13 pm IST

STHREE RIDE | ‘స్త్రీ రైడ్’ కార్య‌క్ర‌మం ప్రారంభం.. మహిళా సాధికార‌త‌కు అత్యంత ప్రాధాన్యం
Advertisement

STHREE RIDE | త్రినేత్ర‌.న్యూస్ : మహిళాభద్రతా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన స్త్రీ రైడ్ కార్యక్రమాన్ని డీజీపీ సీవీ ఆనంద్ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్లు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మహిళల సాధికారత, భద్రత, నైపుణ్యాభివృద్ధి తెలంగాణ పోలీస్ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. సవాళ్లను ఎదుర్కొని తమకంటూ ప్రత్యేకస్థానం ఏర్పరచుకోవాలని మహిళలకు పిలుపునిచ్చారు. వృత్తిపరమైన డ్రైవింగ్ కెరీర్‌లోకి అడుగుపెడుతున్న మహిళల ధైర్యానికి, స్వాతంత్య్రానికి ఇది ఒక శక్తివంతమైన నిదర్శనమని ఆయన అభివర్ణించారు. మహిళలు ముందుకు వచ్చి, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొవాల‌న్నారు. తమకంటూ ఒక ప్ర‌త్యేక‌ స్థానాన్ని సృష్టించుకోవాలని చెప్పారు.

 

మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌ కోసం తెలంగాణ ప్ర‌భుత్వం అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింద‌ని గుర్తు చేశారు. షీ టీమ్స్, షీ ష‌టిల్స్, షీ యాప్స్, షీ క్యాబ్స్, భ‌రోసా కేంద్రాలు, సీడీఈడ‌బ్ల్యూ వంటి కార్య‌క్ర‌మాలను చేప‌ట్టింద‌న్నారు. మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు ఇవి భ‌రోసాగా నిలిచాయ‌న్నారు. పోలీసు డిపార్ట్‌మెంట్‌లోనూ మ‌హిళా ఆఫీస‌ర్ల‌కు పెద్ద‌పీట వేశామ‌న్నారు. పోలీస్ శాఖ మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మహిళా డ్రైవర్లకు డీజీపీ హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement