త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samantha | స‌మంత‌కు సాయిప‌ల్ల‌వి ఆఫ‌ర్ – టాప్ హీరోయిన్ల కాంబోలో సినిమా

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు స‌మంత‌, సాయిప‌ల్ల‌వి క‌లిసి ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఈ సినిమాకు స‌మంత ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోండ‌గా...సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా క‌నిపించ‌బోతుంది.

N

Entertainment | Published On Jun 7, 2026, 2.50 pm IST

Samantha | స‌మంత‌కు సాయిప‌ల్ల‌వి ఆఫ‌ర్ – టాప్ హీరోయిన్ల కాంబోలో సినిమా
Advertisement

గ్లామ‌ర్ క్వీన్ స‌మంత‌, నాచుర‌ల్ బ్యూటీ సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతుంది. ఈ ఇద్ద‌రు హీరోయిన్లు అఫీషియ‌ల్‌గా సినిమాను అనౌన్స్ చేశారు. స‌మంత హీరోయిన్‌గా న‌టించిన మా ఇంటి బంగారం మూవీ జూన్ 19న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. క్రైమ్ కామెడీగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీని భ‌ర్త రాజ్ నిడిమోరుతో క‌లిసి స‌మంత స్వ‌యంగా నిర్మిస్తోంది. నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

సాయిప‌ల్ల‌వి చేయాల్సింది....

ప్ర‌స్తుతం మా ఇంటి బంగారం ప్ర‌మోష‌న్స్‌తో స‌మంత బిజీగా ఉంది. ఈ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా శ‌నివారం ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో ముచ్చ‌టించింది. మా ఇంటి బంగారం సినిమాలో హీరోయిన్‌గా ఫ‌స్ట్ ఛాయిస్ తాను కాద‌ని, సాయిప‌ల్ల‌వి ఈ సినిమా చేయాల్సింద‌ని స‌మంత చెప్పింది. సాయిప‌ల్ల‌వి బిజీగా ఉండంతో తాను న‌టించాన‌ని అన్న‌ది. భ‌విష్య‌త్తులో త‌ప్ప‌కుండా సాయిప‌ల్ల‌వితో త‌న బ్యాన‌ర్‌లో సినిమా చేస్తాన‌ని స‌మంత చెప్పింది.

రాసిపెట్టుంది...

స‌మంత కామెంట్స్‌పై సాయిప‌ల్ల‌వి రియాక్ట్ అయ్యింది. స‌మంత నిర్మాణ సంస్థ‌లో సినిమా చేయ‌డానికి అంగీకారం తెలిపింది. "మా ఇంటి బంగారంలో మీరు న‌టించాల‌ని రాసిపెట్టుంది. అందుకే మీకే అవ‌కాశం ద‌క్కింది. మీ బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌డానికి నేను రెడీ. త్వ‌ర‌లోనే మ‌నం క‌లిసి సినిమా చేద్దాం" అంటూ సాయిప‌ల్ల‌వి రిప్లై ఇచ్చింది. వీరిద్ద‌రి ట్విట్ట‌ర్ సంభాష‌ణ అభిమానుల్లో ఆస‌క్తి క‌రంగా మారింది.

లేడీ ఓరియెంటెడ్ మూవీ...

మా ఇంటి బంగారం త‌ర్వాత ట్రాలాలా మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌లో సాయిప‌ల్ల‌వితో స‌మంత ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీకి రాజ్ డీకే క‌థ‌ను అందించ‌నున్నార‌ట‌. కొత్త డైరెక్ట‌ర్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ ఏడాదిలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం. తెలుగులో సాయిప‌ల్ల‌వి చేయ‌నున్న ఫ‌స్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇదేన‌ని స‌మాచారం.

ప్ర‌స్తుతం సాయిప‌ల్ల‌వి హిందీలో రామాయ‌ణ సినిమా చేస్తోంది. ఈ మైథ‌లాజిక‌ల్ మూవీలో ర‌ణ‌భీర్‌క‌పూర్ హీరోగా న‌టిస్తోన్నాడు. త‌మిళంలో ధ‌నుష్‌తో స్పై యాక్ష‌న్ సినిమా చేస్తోంది.

 

Advertisement
Advertisement