త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Summer Holidays | పాఠ‌శాల‌ల‌కు వేస‌వి సెల‌వులు పొడిగింపు

Summer Holidays | పాఠ‌శాల‌ల‌కు ఈనెల 14 వ‌ర‌కు వేస‌వి సెల‌వులు పొడిగిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. తిరిగి ఈనెల 15న పాఠ‌శాల‌లు పునఃప్రారంభ‌మ‌వుతాయ‌ని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు

S

Telangana | Published On Jun 7, 2026, 2.06 pm IST

Summer Holidays | పాఠ‌శాల‌ల‌కు వేస‌వి సెల‌వులు పొడిగింపు
Advertisement

Summer Holidays | త్రినేత్ర‌.న్యూస్: పాఠ‌శాల‌ల‌కు ఈనెల 14 వ‌ర‌కు వేస‌వి సెల‌వులు పొడిగిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ‌లో ఎండ‌ల తీవ్ర‌త నేప‌థ్యంలో సెల‌వులను పొడిగిస్తున్న‌ట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. తిరిగి ఈనెల 15న పాఠ‌శాల‌లు పునఃప్రారంభ‌మ‌వుతాయ‌ని తెలిపారు. పాఠశాలలు పునఃప్రారంభమవడానికి ముందు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని యాజమాన్యాలకు ప్రభుత్వం సూచించింది.

ముందే నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల‌ 12న పాఠ‌శాల‌లు పునఃప్రారంభం కావాల్సి ఉంది. అయితే 13న‌ రెండో శనివారం, 14న ఆదివారం కావడంతో షెడ్యూల్‌లో మార్పు చేసినట్టు విద్యాశాఖ పేర్కొంది. జూన్ 13 రెండో శనివారం సెలవుకు బదులు జులై 11న తరగతులు నిర్వహించాల‌ని సూచించింది.

 

Advertisement
Advertisement