త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Women Safety Wing | ప్రాంతాల్లో పర్య‌టిస్తూ.. మ‌హిళ‌ల భ‌ద్ర‌తపై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ

Women Safety Wing | ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా భద్రతా విభాగం (Women Safety Wing) అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌పై విస్తృత అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియాను ఉపయోగించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను ఉమెన్ అండ్‌ చైల్డ్ సేఫ్టీ వింగ్ బృందం ప్రజలకు వివరించింది.

S

Hyderabad | Published On Jun 7, 2026, 3.51 pm IST

Women Safety Wing | ప్రాంతాల్లో పర్య‌టిస్తూ.. మ‌హిళ‌ల భ‌ద్ర‌తపై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ
Advertisement
  • ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, ఉమెన్ అండ్‌ చైల్డ్ సేఫ్టీ వింగ్

Women Safety Wing | త్రినేత్ర‌.న్యూస్: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా భద్రతా విభాగం (Women Safety Wing) అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌పై విస్తృత అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. హైదరాబాద్‌లోని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU), ఉమెన్ అండ్‌ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఆదివారం బోరబండ బస్తీ, రహ్మత్ నగర్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, చౌమహల్లా ప్యాలెస్ ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు.

లింగ సమానత్వం, బాలల భద్రత, మహిళలు, బాలలపై జరుగుతున్న వివిధ రకాల హింస త‌దిత‌ర అంశాలపై ప్రజల‌కు తెలియ‌జేశారు. వీటితో పాటు సైబర్ నేరాలు, సోషల్ మీడియాను ఉపయోగించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను ఉమెన్ అండ్‌ చైల్డ్ సేఫ్టీ వింగ్ బృందం ప్రజలకు వివరించింది. మానవ అక్రమ రవాణా (Human Trafficking) వల్ల కలిగే ప్రమాదాలు, వాటి నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎలాంటి భయం లేకుండా సంఘటనలపై ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ఈ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను ఉమెన్ అండ్‌ చైల్డ్ సేఫ్టీ వింగ్ డీసీపీ, ఏహెచ్‌టీయూ, జేబీ యూనిట్ ఏసీపీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.

ఇవీ అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు

• పోలీస్ అత్యవసర సేవలు-100 / 112
• సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్- 1930
• చైల్డ్ హెల్ప్‌లైన్- 1098

 

Advertisement
Advertisement