త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND Vs AFG Test | బ్యాటింగ్‌లో దుమ్మురేపిన భార‌త్‌.. 564 ప‌రుగుల వ‌ద్ద ఇన్నింగ్స్ డిక్లేర్‌.. ఆఫ్ఘ‌న్ స్కోర్ 81/3

IND Vs AFG Test | ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత జట్టు బ్యాటింగ్‌లో స‌త్తా చాటింది. రెండో రోజు ఆటలో ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా, తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్లకు 564 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు బ్యాటర్లు అందరూ బాధ్యతాయుతంగా ఆడ‌డం జ‌ట్టు భారీ స్కోర్ చేయ‌గ‌లిగింది.

P

Sports | Published On Jun 7, 2026, 4.05 pm IST

IND Vs AFG Test | బ్యాటింగ్‌లో దుమ్మురేపిన భార‌త్‌.. 564 ప‌రుగుల వ‌ద్ద ఇన్నింగ్స్ డిక్లేర్‌.. ఆఫ్ఘ‌న్ స్కోర్ 81/3
Advertisement

IND Vs AFG Test | ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత జట్టు బ్యాటింగ్‌లో స‌త్తా చాటింది. రెండో రోజు ఆటలో ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా, తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్లకు 564 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు బ్యాటర్లు అందరూ బాధ్యతాయుతంగా ఆడ‌డం జ‌ట్టు భారీ స్కోర్ చేయ‌గ‌లిగింది. శుభ్‌మన్ గిల్ 126 పరుగులతో ఆకట్టుకోగా.. కేఎల్ రాహుల్ 101 పరుగులతో శతకం నమోదు చేశాడు. వీరిద్దరి భాగస్వామ్యం భారత్‌కు దృఢమైన పునాది వేసింది.

అనంతరం మిడిల్ ఆర్డర్‌లో రిషభ్ పంత్, సాయి సుదర్శన్ చెలరేగి ఆడారు. ఇద్దరూ 81 పరుగుల చొప్పున సాధించి స్కోరు బోర్డును వేగంగా ముందుకు నడిపించారు. అంతేకాకుండా వాషింగ్టన్ సుందర్ కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన అతడు జట్టు స్కోరును 500 పరుగుల మార్క్ దాటించడంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో బౌలర్లూ బ్యాట్‌తో మెరిపించారు. మహ్మద్ సిరాజ్ కేవలం 12 బంతుల్లోనే 22 పరుగులు చేసి ప్రేక్షకులను అలరించాడు. సిరాజ్ ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఒక భారీ సిక్స‌ర్ ఉన్న‌ది. మానవ్ సుతార్ సైతం దూకుడుగా ఆడి 28 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉండ‌డం విశేషం.

భారత్ బ్యాటర్లు వరుసగా పరుగుల వర్షం కురిపించినప్పటికీ.. ఆఫ్ఘన్‌ బౌలర్ మహ్మద్ సలీం సఫీ స‌త్తా చాటాడు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ భారత బ్యాటర్లకు సవాల్ విసిరాడు. మొత్తం ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా భారీ స్కోరు చేయ‌కుండా మిగ‌తా బౌల‌ర్ల నుంచి స‌హ‌కారం ద‌క్క‌లేదు. మొత్తానికి బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శనతో భారత్ మ్యాచ్‌పై పట్టు బిగించింది. ప్ర‌స్తుతం ఆఫ్ఘ‌నిస్తాన్ బ్యాటింగ్ కొన‌సాగుతున్న‌ది. ప్ర‌స్తుతం 26 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల న‌ష్టానికి 81 ప‌రుగులు చేసింది. కొత్త బౌల‌ర్ మాన‌వ్ సుతార్‌కు రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ప్ర‌సిద్ధ్ కృష్ణ‌కు ఒక వికెట్ ద‌క్కింది.

Advertisement
Advertisement