Jatara | ఆమనగల్లులో పార్వతీ రామలింగేశ్వర స్వామి జాతర.. నిప్పుల గుండంలో పడిన భక్తులు
Jatara | త్రినేత్ర.న్యూస్: నల్లగొండ జిల్లాలోని వేములపల్లి మండలం ఆమనగల్లులో జరుగుతున్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి జాతరలో (Jatara) విషాదం చోటు చేసుకుంది.
Jatara | త్రినేత్ర.న్యూస్: నల్లగొండ జిల్లాలోని వేములపల్లి మండలం ఆమనగల్లులో జరుగుతున్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి జాతరలో (Jatara) విషాదం చోటు చేసుకుంది. ఉత్సవాల్లో భాగంగా భక్తులు అగ్నిగుండం దాటే సంప్రదాయం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ప్రతి ఏడాదిలానే ఈసారీ భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో కొంతమంది భక్తులు నిప్పులపై పడిపోయారు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు, ఇతర భక్తులు కిందపడిపోయిన వారిని బయటకు గుంజేశారు. ఈ ప్రమాదంలో పదకొండు మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరికి కాలిన గాయాలు, మరికొందరికి తోపులాటలో గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో ఉత్సవాల్లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులు సూచించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం






