త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Devi Prasad | కరెంట్ సంక్షోభానికి బాధ్యత కాంగ్రెస్‌దే.. తెలంగాణ అధికారుల‌కు శాపంగా ప్ర‌భుత్వ తీరు: దేవీప్ర‌సాద్‌

Devi Prasad | రాష్ట్రంలో కరెంటు సంక్షోభానికి కాంగ్రెస్ (Congress) స‌ర్కార్‌దే బాధ్య‌త అని బీఆర్ఎస్ నేత, టీజీవో మాజీ అధ్య‌క్షుడు దేవీప్ర‌సాద్ (Devi Prasad) ఆరోపించారు. ప్రణాళిక లేని ప్రభుత్వ తీరు తెలంగాణ (Telangana) అధికారులకు శాపంగా మారింద‌ని మండిప‌డ్డారు.

G

Telangana | Published On Oct 15, 2026, 1.10 pm IST

Devi Prasad | కరెంట్ సంక్షోభానికి బాధ్యత కాంగ్రెస్‌దే.. తెలంగాణ అధికారుల‌కు శాపంగా ప్ర‌భుత్వ తీరు: దేవీప్ర‌సాద్‌
Advertisement

Devi Prasad | త్రినేత్ర న్యూస్‌: రాష్ట్రంలో కరెంటు సంక్షోభానికి కాంగ్రెస్ (Congress) స‌ర్కార్‌దే బాధ్య‌త అని బీఆర్ఎస్ నేత, టీజీవో మాజీ అధ్య‌క్షుడు దేవీప్ర‌సాద్ (Devi Prasad) ఆరోపించారు. ప్రణాళిక లేని ప్రభుత్వ తీరు తెలంగాణ (Telangana) అధికారులకు శాపంగా మారింద‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతోనే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం, నీటి కష్టాలు తలెత్తుతున్నాయ‌ని విమ‌ర్శించారు. సింగరేణిలో (Singareni) బొగ్గు ఉత్పత్తి ఉన్నా విద్యుత్ ప్లాంట్లకు సరఫరా కావడం లేద‌ని, దీంతో విద్యుత్తు ఉత్పత్తి తగ్గిపోయి సంక్షోభానికి దారి తీసింద‌న్నారు.

గోదావరి నదిలో నీటి లభ్యత ఉన్నా ఎత్తిపోతలో విఫలం కావడంతో నీటి కొరత తీవ్రంగా ఉంద‌ని చెప్పారు. మరో వైపు ప్రజలకు భ‌రోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం కరెంటు ఉండదు, నీరు దొరకదు, పంటలు వెయ్యొద్దు అని భయపెడుతూ బాధ్య‌త నుంచి తప్పుకుంటున్నదని ధ్వ‌జ‌మెత్తారు. ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకతని అధికారులపైకి నెట్టి చేతులు దులుపుకుంటున్నద‌ని వివ‌మ‌ర్శించారు. ఇందులో భాగంగా చీఫ్ ఇంజినీర్ సురేశ్‌ను సస్పెండ్ చేయడం దుర్మార్గమైన చ‌ర్య అని వెల్ల‌డించారు.

తెలంగాణ అధికారులు బ‌లి

బొగ్గు సరఫరా చేయకుండా ఉత్పత్తి తగ్గిందని అధికారులను ఎలా బాధ్యులను చేస్తార‌ని ప్ర‌శ్నించారు. బాధ్యత ప్రభుత్వానిదా?.. అధికారులదా? అని మండిప‌డ్డారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థల నిర్వహణలో ప్రభుత్వ ప్రణాళికా లోపాలు, యాజమాన్య వైఫల్యాలు బయటపడుతున్నాయని విద్యుత్ ఇంజినీర్ల సంఘాల నాయకులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బొగ్గు సరఫరా వంటి కీలకమైన అంశాల్లో తగిన ఏర్పాట్లు చేయకుండా, విద్యుత్ ఉత్పత్తి తగ్గిందనే కారణంతో క్షేత్రస్థాయి అధికారులను బలిపశువులను చేయడం సమస్యను పక్కదారిపట్టించేలా ఉంద‌న్నారు.

విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును సమయానికి సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, జెన్కో యాజమాన్యానికి లేదా? అని ప్ర‌శ్నించారు. బొగ్గు అందుబాటులో లేకపోతే అధికారులు ఏ విధంగా విద్యుత్ ఉత్పత్తి చేయగలరో స్పష్టత ఇవ్వాల‌న్నారు. ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకును అందించకుండా, ఉత్పత్తి లక్ష్యాలు సాధించలేదని అధికారులను సస్పెండ్ చేయడం సమస్యకు పరిష్కారం కాద‌ని చెప్పారు.

స్టేజ్‌-1 అధికారిపైనే చర్యలు ఎందుకు?

స్టేజ్‌-1లో లోపాలకు బాధ్యులుగా సురేశ్‌పై చర్యలు తీసుకున్నప్పుడు, స్టేజ్‌-2లో పరిస్థితులపై కూడా సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం లేదా? అని ప్ర‌శ్నించారు. అధికారులపై చర్యలు తీసుకునే విషయంలో ఒకే విధమైన ప్రమాణాలు పాటించాల‌న్నారు. క్షేత్రస్థాయి అధికారులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని, ఉన్నతస్థాయి ఆంధ్రా అధికారుల‌ బాధ్యతలను విస్మరిస్తే అనేక అనుమానాలకు తావిస్తుంద‌న్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులపై చర్యలు తీసుకోకుండా, తెలంగాణ అధికారులను మాత్రమే బలిచేస్తున్నారనే ఆరోపణలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

సమగ్ర విచారణ జరపాలి..

విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలో బొగ్గు సరఫరా, సాంకేతిక నిర్వహణ, ప్రణాళిక, యాజమాన్య పర్యవేక్షణ వంటి అంశాలపై సమగ్ర విచారణ జరిపి, ఎవరి తప్పిదం ఉందో నిష్పక్షపాతంగా నిర్ధారించాల‌న్నారు. తప్పు చేసినవారిపై చర్యలు తీసుకోవాలి కానీ, వ్యవస్థాగత వైఫల్యాలకు ఉద్యోగులను బలిచేయడం అన్యాయమ‌ని చెప్పారు. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారుల నియామకాలు, బదిలీలు, బాధ్యతల కేటాయింపులపై పారదర్శకత పాటించాల‌న్నారు.

కీలక విభాగాల్లో స్థానిక తెలంగాణ అధికారులకు తగిన ప్రాధాన్యం కల్పించాలని, అవసరమైన చోట అధికారులను బదిలీ చేయాల‌ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రణాళికా లోపాలను సరిదిద్ది, విద్యుత్ సంస్థల వైఫల్యాలపై సమగ్ర విచారణ జరిపాల‌ని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఇంజినీర్లలో నెలకొన్న ఆందోళనను తొలగించాల‌న్నారు. బాధ్యత నిర్ణయించడంలో వివక్షకు తావులేకుండా న్యాయం చేయాల‌న్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement