Ponguleti Srinivas Reddy | డెస్క్ జర్నలిస్టుల సమస్య పరిష్కరిస్తాం.. మంత్రి పొంగులేటి హామీ
Ponguleti Srinivas Reddy | డెస్క్ జర్నలిస్టులకూ గతంలో మాదిరిగానే అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చేలా చూస్తామని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.
Ponguleti Srinivas Reddy | త్రినేత్ర.న్యూస్ : డెస్క్ జర్నలిస్టులకూ గతంలో మాదిరిగానే అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చేలా చూస్తామని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. డెస్క్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్ టీ) ఖమ్మం జిల్లా అడ్ హక్ కమిటీ సభ్యులు, టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు సంయుక్తంగా శనివారం మహబూబాబాద్‌లో మంత్రికి వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా డెస్క్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ సమస్యలను డీజేఎఫ్ టీ నేతలతో కలిసి టీడబ్ల్యూజేఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్, కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షుడు సాగర్ దువ్వా, స్టేట్ కౌన్సిల్ సభ్యులు నాగేందర్ రెడ్డి వివరించారు. డెస్క్ జర్నలిస్టులకు సైతం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందిస్తూ డెస్క్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వెంటనే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. జర్నలిస్టులందరికీ న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు
మంత్రిని కలిసిన వారిలో డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్ టీ) అడహక్ కమిటీ కన్వీనర్ కాంకూరి వెంకటేశ్వరరావు, కో- కన్వీనర్లు కేతిరెడ్డి అచ్చిరెడ్డి, వంశీ, శాబాదు కరుణాకర్ రెడ్డి, నాయకులు వెంకటప్పయ్య, వీరభద్రాచారి, బాలకృష్ణ, అశోక్, కరుణాకర్, టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు యాస లక్ష్మారెడ్డి తదితరులున్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



