త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Deficit Rainfall | 16 జిల్లాల్లో లోటు వ‌ర్ష‌పాతం.. హైద‌రాబాద్‌లో మాత్రం సాధార‌ణం

Deficit Rainfall | తెలంగాణ‌లో నైరుతి రుతుప‌వ‌నాలు( Monsoon ) ప్ర‌వేశించి దాదాపు నెల రోజులు అవుతున్న‌ప్ప‌టికీ.. ప‌లు జిల్లాల్లో లోటు వ‌ర్ష‌పాతం( Deficit Rainfall ) న‌మోదైంది. రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రం మాత్రంలో సాధార‌ణ వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

S

Telangana | Published On Jun 30, 2026, 4.23 pm IST

Deficit Rainfall | 16 జిల్లాల్లో లోటు వ‌ర్ష‌పాతం.. హైద‌రాబాద్‌లో మాత్రం సాధార‌ణం
Advertisement

Deficit Rainfall | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ‌లో నైరుతి రుతుప‌వ‌నాలు( Monsoon ) ప్ర‌వేశించి దాదాపు నెల రోజులు అవుతున్న‌ప్ప‌టికీ.. ప‌లు జిల్లాల్లో లోటు వ‌ర్ష‌పాతం న‌మోదైంది. రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రం మాత్రంలో సాధార‌ణ వ‌ర్ష‌పాతం న‌మోదైంది. జూన్ 1వ తేదీ నుంచి జూన్ 29 వర‌కు న‌మోదైన వ‌ర్ష‌పాత వివ‌రాల‌ను తెలంగాణ స్టేట్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) వెల్ల‌డించింది. వాస్త‌వానికి ఈ నెల రోజుల వ్య‌వ‌ధిలో సాధార‌ణంగా 124.6 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదు కావాలి. కానీ కేవ‌లం 113 మి.మీ. వ‌ర్షపాతం న‌మోదైంది.

హైద‌రాబాద్ న‌గ‌రంలో ఈ నెల రోజుల్లో 103.0 మి.మీ. వ‌ర్ష‌పాతం (సాధార‌ణ వ‌ర్ష‌పాతం 104.4 మి.మీ.) న‌మోదైంది. మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరిలో సాధార‌ణ వ‌ర్ష‌పాతానికి భిన్నంగా కేవ‌లం 63 మి.మీ. వ‌ర్షపాతం న‌మోదైంది. హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో క‌లిపి 14.13 మి.మీ. వ‌ర్షపాతం(సాధార‌ణ వ‌ర్ష‌పాతం 93.3 మి.మీ.) న‌మోదైన‌ట్లు టీఎస్‌డీపీఎస్ గ‌ణాంకాల ద్వారా వెల్ల‌డైంది. ఇక రంగారెడ్డి జిల్లాలో 14 రోజుల పాటు వ‌ర్షాలు కురిశాయి. అంటే ప్ర‌తి రెండు రోజుల‌కోసారి వ‌ర్షం కురిసింది. వికారాబాద్ జిల్లాలో 105.9 మి.మీ.(సాధార‌ణ వ‌ర్ష‌పాతం 110.1 మి.మీ.), సంగారెడ్డి జిల్లాలో 124.5 మి.మీ.(సాధార‌ణ వ‌ర్ష‌పాతం 115.5 మి.మీ.) వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

అధిక వ‌ర్ష‌పాతం న‌మోదైన జిల్లాలు ఇవే

రంగారెడ్డి, న‌ల్ల‌గొండ‌, సూర్యాపేట‌, నాగ‌ర్‌క‌ర్నూల్, ఖ‌మ్మం

సాధార‌ణ వ‌ర్షపాతం న‌మోదైన జిల్లాలు ఇవే

ములుగు, సంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, హైద‌రాబాద్, వికారాబాద్, కొత్త‌గూడెం, నారాయ‌ణ‌పేట‌, పెద్ద‌ప‌ల్లి, నిర్మ‌ల్, ఆసిఫాబాద్, మ‌హ‌బూబాబాద్, భూపాల‌ప‌ల్లి

లోటు వ‌ర్షపాతం న‌మోదైన జిల్లాలు ఇవే..

కామారెడ్డి, వ‌న‌ప‌ర్తి, రాజ‌న్న సిరిసిల్ల‌, మెద‌క్, జ‌న‌గామ‌, జ‌గిత్యాల‌, మంచిర్యాల‌, భువన‌గిరి, క‌రీంన‌గ‌ర్, గద్వాల‌, ఆదిలాబాద్, నిజామాబాద్, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, సిద్దిపేట‌, వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ

Advertisement
Advertisement