త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు మృతి

Road Accident | సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కంది చౌర‌స్తాలో వేగంగా దూసుకువ‌చ్చిన కారు డివైడ‌ర్‌ను ఢీకొట్టింది. అనంత‌రం ప‌ల్టీలు కొట్టింది.

S

Telangana | Published On Nov 3, 2026, 8.43 am IST

Road Accident | సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు మృతి
Advertisement

Road Accident | త్రినేత్ర న్యూస్ : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కంది చౌర‌స్తాలో వేగంగా దూసుకువ‌చ్చిన కారు డివైడ‌ర్‌ను ఢీకొట్టింది. అనంత‌రం ప‌ల్టీలు కొట్టింది. ఈ ప్ర‌మాదంలో కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుల‌ను శంకరపల్లి మండలం గాజులగూడెంనకు చెందిన దంపతులు నర్సింహులు, నవనీతగా గుర్తించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ట్యాగ్స్:

Car Hits DividerKandiPoliceRoad AccidentSangareddyShankarpally
Advertisement
Advertisement