Cyber Fraud | రూ.5 వేలు ఆశచూపి.. ఐటీ ఉద్యోగి నుంచి రూ.2.9 కోట్లు కొట్టేశారు
Cyber Fraud | ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తున్నా, పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా.. అత్యాశకు పోతున్న కొందరు సైబర్ నేరగాళ్లలో వలలో (Cyber Fraud) చిక్కుకుంటే ఉన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న కొరికతో రూ.కోట్లలో పోగొట్టుకుంటుకుని అప్పులపాలవుతున్నారు.
త్రినేత్ర.న్యూస్: ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తున్నా, పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా.. అత్యాశకు పోతున్న కొందరు సైబర్ నేరగాళ్లలో వలలో (Cyber Fraud) చిక్కుకుంటే ఉన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న కొరికతో రూ.కోట్లలో పోగొట్టుకుంటుకుని అప్పులపాలవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ శేరిలింగంపల్లిలో జరిగింది. స్టాక్ మార్కెట్లో (Stock Market) పెట్టుబడులు పెడితే 300 శాతం లాభం వస్తుందని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని (Software Employee) సైబర్ నేరగాళ్లు నమ్మించారు. తొలిసారి పెట్టుబడికి అదనంగా రూ.5 వేలు ఇచ్చారు. నిజంగానే లాభాలు వస్తాయని నమ్మిన అతడు అప్పులు చేసిమరీ విడతలవారీగా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేశాడు. పెద్దమొత్తంలో పెట్టుబడి పెడుతున్నా.. ఎంతకూ డబ్బు తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించాడు. తీరా కోట్లలో పోగొట్టుకున్న తర్వాత సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
శేరిలింగంపల్లికి చెందిన ఓ ఐటీ ఉద్యోగికి (45) గతేడాది నవంబర్ 12న.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు సలహాలిస్తామంటూ వాట్సప్‌లో ఒక వెబ్‌లింక్ వచ్చింది. దీంతో దానిని క్లిక్ చేసి వాట్సప్ గ్రూపులో చేరాడు. అనిల్ గోయల్ అనే వ్యక్తి అతడిని పరిచయం చేసుకుని.. తన వద్ద షేర్ల గురించి ఎంతో మంది సలహాలు తీసుకున్నారని, బాగా డబ్బు సంపాదించారంటూ స్క్రీన్‌షాట్లు పోస్టు చేశాడు. గ్రూపులోని ప్రతి ఒక్కరూ 300 శాతం లాభాలు పొందవచ్చని నమ్మించాడు.
దీంతో దానిని నిజమేనని నమ్మిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. అతడు చెప్పినట్లుగా యాప్ డౌన్‌లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. డిసెంబరు 15న తొలిసారి రూ.50 వేలు పెట్టుబడి పెట్టాడు. దానికి రూ.5 వేలు లాభం వచ్చింది. దీంతో మరింత ఎక్కువ సంపాదించాలన్న ఆశతో అప్పు చేసి మరీ పలుమార్లు ఏకంగా రూ.2.9 కోట్లు బదిలీ చేశాడు. ఈ క్రమంలో పెట్టుబడి, లాభం కలిపి మొత్తం రూ.3.47 కోట్లకు చేరినట్లు యాప్‌లో వర్చువల్‌గా కనిపించేది. అయితే అప్పులు పెరగడంతో షేర్లలో కొన్నింటిని అమ్మేసి వాటిని తీర్చాలనుకున్నాడు. ఈ విషయమై వాట్సప్ గ్రూపులో సలహాలిచ్చిన అనిల్‌ను ఫోన్‌లో సంప్రదించాడు. అలా విక్రయించడం సాధ్యంకాదని చెప్పిన అతడు.. అదనంగా డబ్బు చెల్లించాలన్నాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





