Komatireddy Venkat Reddy | నల్గొండను హైదరాబాద్‌లా అభివృద్ధి చేసుకుందాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Komatireddy Venkat Reddy | నల్గొండ (Nalgonda) ను హైదరాబాద్ (Hyderabad)లా అభివృద్ధి చేసుకుందామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. తన కోరిక మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్ చేశారని చెప్పారు. సీఎంకు నల్గొండ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.
Komatireddy Venkat Reddy | నల్గొండ (Nalgonda) ను హైదరాబాద్ (Hyderabad)లా అభివృద్ధి చేసుకుందామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. మున్సిపాలిటీ కంటే కార్పొరేషన్‌కు ఎక్కువ నిధులు వస్తాయని, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కావటంతో కేంద్రం నుంచి నేరుగా నిధులు తెచ్చుకునేందుకు అవకాశం లభిస్తుందని చెప్పారు. 25 నెలల్లోనే కార్పొరేషన్ తీసుకువచ్చానని, గతంలో కంటే ఇంకా వేగంగా నల్గొండను అభివృద్ధి చేసుకునేందుకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. నల్గొండలో రూ. 20 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శనివారం శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కోరిక మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్ చేశారని చెప్పారు. సీఎంకు నల్గొండ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నల్గొండ కార్పొరేషన్‌లో అన్ని స్థానాలు గెలిచి సీఎంకు గిఫ్టుగా ఇవ్వాలని కోరారు.
నల్గొండ కార్పొరేషన్‌లో ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్‌తో పాటు, రూ.700 కోట్లతో ఓఆర్ఆర్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ధర్వేశిపురం వరకు ఆరు లైన్ల రోడ్డును నిర్మించనున్నామని చెప్పారు. రూ.140 కోట్లతో బ్రహ్మ గారి గుట్ట, లతీప్ సాబ్ దర్గా గుట్ట అభివృద్ధి, దొరేపల్లి, అనంతారం వరకు రోడ్లు నిర్మిస్తున్నామని వివరించారు. ఎస్ఎల్‌బీసీని పూర్తి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏఎంఆర్‌పీ కాలువల లైనింగ్‌కు రూ.450 కోట్లు మంజూరు చేయించామని తెలిపారు. బ్రాహ్మణ వెళ్లెముల ప్రాజెక్టు ద్వారా మునుగోడు, చండూరులకు సైతం సాగునీరు అందుతుందని వివరించారు. నల్గొండ ప్రజలందరూ మత సమరస్యంతో శాంతియుతంగా ఉండాలని సూచించారు. కార్పొరేషన్ అభివృద్ధికి సహకారం అందించాలన్నారు. రాజకీయాలకతీతంగా నల్గొండను అభివృద్ధి చేస్తామని తెలిపారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. కార్పోరేషన్ పరిధిలో అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, భూగర్భ మురికి కాలువలతో అద్భుతంగా తీర్చిదిద్దుతానని ఉద్ఘాటించారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





