త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chain Snatching | హైద‌రాబాద్‌లో రెచ్చిపోయిన చైన్‌ స్నాచ‌ర్స్‌..మూడుచోట్ల బంగారు గొలుసులు ఎత్తుకెళ్లిన దొంగ‌లు

హైద‌రాబాద్ న‌గ‌ర శివారులో దొంగ‌లు రెచ్చిపోయారు. న‌గ‌ర శివార్ల‌లో మూడుచోట్ల చైన్ స్నాచ‌ర్లు మ‌హిళ‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకొని గొలుసుల‌ను ఎత్తుకు వెళ్లారు. ఒకేరోజు మూడుచోట్ల వ‌రుస ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డంతో జ‌నం ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

P

Hyderabad | Published On Jan 17, 2026, 5.30 pm IST

Chain Snatching | హైద‌రాబాద్‌లో రెచ్చిపోయిన చైన్‌ స్నాచ‌ర్స్‌..మూడుచోట్ల బంగారు గొలుసులు ఎత్తుకెళ్లిన దొంగ‌లు
Advertisement

 త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌ర శివారులో దొంగ‌లు రెచ్చిపోయారు. న‌గ‌ర శివార్ల‌లో మూడుచోట్ల చైన్ స్నాచ‌ర్లు మ‌హిళ‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకొని గొలుసుల‌ను ఎత్తుకు వెళ్లారు. ఒకేరోజు మూడుచోట్ల వ‌రుస ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డంతో జ‌నం ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. నాగోల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని బ్లైండ్స్ కాల‌నీలో మ‌ణెమ్మ (58) అనే మ‌హిళ ఇంట్లో నుంచి కొడుకు ఇంటికి న‌డుచుకుంటూ వెళ్తున్న స‌మ‌యంలో ద్విచ‌క్ర వాహ‌నంపై వ‌చ్చిన ఇద్ద‌రు యువ‌కులు ఆమె మెడ‌లో ఉన్న రెండున్న‌ర తులాల బంగారు పుస్తెల‌తాడును ఎత్తుకు వెళ్లారు. ఆమె కొడుకు ఎస్ఐగా స‌మాచారం. అలాగే, హ‌య‌త్‌న‌గ‌ర్ పీఎస్ ప‌రిధిలోని అంజ‌నాద్రి కాల‌నీలో మ‌రో చైన్ స్నాచింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

చింత‌కుంట్ల విజ‌య (47) అనే మ‌హిళ మెడ‌లో నుంచి మూడున్న‌ర తులాల బంగారు పుస్తెల తాడును లాక్కు వెళ్లారు. అలాగే చైత్య‌పురిలో మ‌హిళ నుంచి చైన్‌ను లాక్కువెళ్లారు. వ‌రుస దొంగ‌త‌నాల‌తో బాధితులు ల‌బోదిబోంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వ‌రుస ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో పోలీసులు సీరియ‌స్‌గా తీసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల‌ను ప‌రిశీలించారు. నాగోల్ సీఎస్ ప‌రిధిలో సీసీటీవీ ఫుటేజీని ప‌రిశీలించ‌గా.. ఇద్ద‌రు యువ‌కులు ప‌ల్స‌ర్ వాహ‌నంపై వ‌చ్చి చైన్ స్నాచింగ్ చేసిన‌ట్లుగా గుర్తించారు. మూడుచోట్ల స్నాచింగ్‌కు పాల్ప‌డింది ఒక‌టే ముఠానా? ఇంకా ఎవ‌రైనా ఉన్నారా? అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement