Leopard | బేగంపేటలో చిరుత పులి కలకలం
Leopard | రాష్ట్రంలో చిరుతల సంచారం అధికమైపోతోంది. అభయారణ్యాల నుంచి మైదాన ప్రాంతాల్లోకి చిరుతలు ప్రవేశిస్తున్నాయి. అటవీ సరిహద్దు ఉన్న జిల్లాలకే చిరుతలు పరిమితం కావడం లేదు.. పట్టణ ప్రాంతాల వైపు చిరుతలు పరుగెడుతున్నాయి.
Leopard | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో చిరుతల సంచారం అధికమైపోతోంది. అభయారణ్యాల నుంచి మైదాన ప్రాంతాల్లోకి చిరుతలు ప్రవేశిస్తున్నాయి. అటవీ సరిహద్దు ఉన్న జిల్లాలకే చిరుతలు పరిమితం కావడం లేదు.. పట్టణ ప్రాంతాల వైపు చిరుతలు పరుగెడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో చిరుతపులి కలకలం సృష్టిస్తుంది.
భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి, రాజాపేట మండలాల్లో చిరుత సంచరిస్తుంది. ఆదివారం తెల్లవారుజామున తుర్కపల్లి మండల పరిధిలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో ఆవు దూడలపై చిరుత దాడి చేసింది. ఒక ఆవు దూడను సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లి వదిలేసింది చిరుత. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఇబ్రహీంపూర్ చేరుకుని చిరుత పాదముద్రలను గురించేందుకు యత్నించారు.
పక్కనే ఉన్న రాజాపేట మండలం బేగంపేటలో చిరుత పాదముద్రలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. చిరుత సంచారంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు.
ఈ చిరుత వయసు 8 నుంచి 10 ఏళ్లు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. చిరుత కదలికలను గమనించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట అటవీ ప్రాంతం నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోకి చిరుత ప్రవేశించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే పార్ట్‌నర్ కోసం చిరుత వేట కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



