Cabinet Meeting | 5 గంటలకు మేడారంలో కేబినెట్ భేటీ.. తరలి రానున్న మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు
Cabinet Meeting | తెలంగాణ ప్రభుత్వం సరికొత్త సాంప్రదాయానికి తెరతీసింది. ఎన్నడూ లేనివిధంగా హైదరాబాద్ వెలుపల తొలిసారిగా మంత్రివర్గం భేటీ (Cabinet Meeting) కానుంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు మేడారంలో (Medaram) వనదేవతలైన సమక్క, సారలమ్మ (Sammakka Srakka) చెంత కేబినెట్ సమావేశమవుతుంది.
త్రినేత్ర.న్యూస్: తెలంగాణ ప్రభుత్వం సరికొత్త సాంప్రదాయానికి తెరతీసింది. ఎన్నడూ లేనివిధంగా హైదరాబాద్ వెలుపల తొలిసారిగా మంత్రివర్గం భేటీ (Cabinet Meeting) కానుంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు మేడారంలో (Medaram) వనదేవతలైన సమక్క, సారలమ్మ (Sammakka Srakka) చెంత కేబినెట్ సమావేశమవుతుంది. దీనికోసం మంత్రులతోపాటు అన్ని శాఖ ఉన్నతాధికారులు మేడారానికి తరలివస్తున్నారు. మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో హరిత హోటల్‌లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బందోబస్తు కట్టుదిట్టం చేశారు. హోటల్ పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మేడారం జాతర వేళ.. కేబినెట్ భేటీ విశేషంగా మారింది.
చర్చకు రానున్న కీలక అంశాలు..
మేడారం వేదికగా జరగనున్న కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలపై వేగంగా కసరత్తు జరుగుతున్నది. కీలకమైన రిజర్వేషన్ల అంశం కూడా కొలిక్కి వచ్చింది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ జారీ అంశంపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రస్తుత రబీ సీజన్‌లో రైతు భరోసా నిధులను విడుదల చేయాల్సి ఉంది. ఈ విషయంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తున్నది. గోదావరి పుష్కరాలతోపాటు ఉత్తర తెలంగాణలోని పలు ప్రాజెక్టులు చర్చకు రానున్నాయి. పొట్లపూర్ ఎత్తి పోతల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పథకాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.
కాగా, ప్రస్తుతం ఖమ్మం పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం మేడారం చేరుకుంటారు. ఆదివారం మధ్యాహ్నం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. నర్సింగ్ కాలేజీ, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్, జేఎన్‌టీయూ కాలేజీ , కూసుమంచిలో 100 పడకల ప్రభుత్వ దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రజా ప్రతినిధులతో సమావేశమవుతారు.
మధ్యాహ్నం 2.30 గంటలకు బీజేఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో జరుగనున్న సీపీఐ శతాబ్ది ఉత్సవ బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ఖమ్మం నుంచి సాయంత్రం 4.30 గంటలకు హెలికాప్టర్లో ములుగు జిల్లా మేడారం చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు సీఎం నేతృత్వంలో మేడారం హరిత హోటల్‌లో మంత్రివర్గ భేటీ జరుగనుంది. సాయంత్రం 6.30 గంటలకు మేడారంలో అభివృద్ధి పనులను సీఎం పరిశీలిస్తారు. రాత్రి 7 గంటలకు మేడారం ఆలయ ఎగ్జిట్ సెంటర్‌లో జరుగనున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం మేడారం హరిత హోటల్‌కు చేరుకుంటారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



