GHMC Elections | జీహెచ్ఎంసీ ఎన్నికలు.. బీసీలకు 122 డివిజన్లు..!
GHMC Elections | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను మున్సిపల్ శాఖ వేగవంతం చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం, బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్టు ఆధారంగా జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 300 డివిజన్లకు రిజర్వేషన్లను ఖరారు చేశారు.
GHMC Elections | త్రినేత్ర.న్యూస్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను మున్సిపల్ శాఖ వేగవంతం చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం, బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్టు ఆధారంగా జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 300 డివిజన్లకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కేటాయించగా, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించారు.
300 డివిజన్లకు రిజర్వేషన్లు ఇలా..
బీసీలకు 122 డివిజన్లు (పురుషులకు 61, మహిళలకు 61)
ఎస్సీలకు 23 డివిజన్లు (పురుషులకు 12, మహిళలకు 11)
ఎస్టీలకు 5 డివిజన్లు (పురుషులకు 03, మహిళలకు 02)
జనరల్ మహిళలకు 76 డివిజన్లు
అన్‌రిజర్వ్‌డ్ - 74
ఆరు జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్లతో ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధిని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 డివిజన్లకు ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మహా నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహా విస్తరణ చేపట్టింది. ఇందులో భాగంగా 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు అవతలి వరకు 2053చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించింది. జీహెచ్‌ఎంసీ అవతల ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేసుకొని 300 డివిజన్లతో మహా హైదరాబాద్‌ను నిర్ణయించింది. దీంతో జీహెచ్‌ఎంసీలో జోన్ల సంఖ్యను ఆరు నుంచి 12కి పెంచారు. 30 సర్కిళ్లను 60 సర్కిళ్లు చేశారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





