త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Medaram | మ‌హాజాత‌ర‌కు ముందే.. మేడారానికి పోటెత్తిన భ‌క్తులు

Medaram | మేడారం (Medaram) మ‌హా జాత‌ర‌కు ముందే వ‌న దేవ‌త‌ల ద‌ర్శ‌నానికి భ‌క్తులు పోటెత్తారు. భ‌క్తుల ర‌ద్దీతో స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ గ‌ద్దెల (Sammakka Srakka Jatara) ప‌రిస‌ర ప్రాంతాలు కిట‌కిట‌లాడుతున్నాయి.

G

Telangana | Published On Jan 18, 2026, 11.36 am IST

Medaram | మ‌హాజాత‌ర‌కు ముందే.. మేడారానికి పోటెత్తిన భ‌క్తులు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: మేడారం (Medaram) మ‌హా జాత‌ర‌కు ముందే వ‌న దేవ‌త‌ల ద‌ర్శ‌నానికి భ‌క్తులు పోటెత్తారు. భ‌క్తుల ర‌ద్దీతో స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ గ‌ద్దెల (Sammakka Srakka Jatara) ప‌రిస‌ర ప్రాంతాలు కిట‌కిట‌లాడుతున్నాయి. అమ్మ‌ల‌ను ద‌ర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ నెల 28 నుంచి 31 వ‌ర‌కు నాలుగు రోజుల పాటు మేడారం జాత‌ర జ‌రుగ‌నుంది. 28న సార‌ల‌మ్మ‌, గోవింద‌రాజు, ప‌గిడిద్ద‌రాజు, 29న స‌మ్మ‌క్క త‌ల్లి చిల‌క‌ల‌గుట్ట నుంచి గ‌ద్దెల‌కు చేరుకుంటారు. 30న భ‌క్తులు మొక్కులు చెల్లించుకుంటారు. 31న అమ్మ‌వార్లు వ‌న ప్ర‌వేశం చేయ‌నున్నారు.

మ‌రోవైపు మేడారం జాత‌ర ప్రాంగ‌ణాన్ని ప్ర‌భుత్వం ఆధునీక‌రించిన విష‌యం తెలిసిందే. జ‌న‌వ‌రి 19న (సోమ‌వారం) ఉదయం 6.30 గంట‌ల‌కు సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో నిర్మించిన పైలాన్‌ను సీఎం రేవంత్ ప్రారంభించ‌నున్నారు. అనంత‌రం అమ్మ‌వార్ల‌కు ప్ర‌త్యేక పూజ‌లు చేస్తారు.

ఇక సాంప్ర‌దాయానికి భిన్నంగా ఆదివారం సాయంత్రం వ‌న‌దేవ‌త‌ల చెంత రాష్ట్ర మంత్రిమండ‌లి స‌మావేశం కానుంది. దీనికోసం కేబినెట్‌తోపాటు ఉన్న‌తాధికారులు అంతా మేడారం త‌ర‌లి రానున్నారు. ఈ నేప‌థ్యంతో పోలీసులు పెద్ద సంఖ్య‌లో మోహ‌రించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement