CU Denver | హైదరాబాద్‌లో అమెరికా ప్రభుత్వ యూనివర్సిటీ.. 2027 నుంచి తరగతులు ప్రారంభించనున్న సీయూ డెన్వర్
CU Denver | అమెరికాకు చెందిన ప్రభుత్వ యూనివర్సిటీ కొలరాడో డెన్వర్ (CU Denver) తన విదేశీ క్యాంపస్‌ను హైదరాబాద్‌లో (Hyderabad) ఏర్పాటు చేయనుంది. క్యాంపస్‌ను నెలకొల్పేందుకు ఇప్పటికే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (UGC) నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LOI) పొందింది.
CU Denver | త్రినేత్ర న్యూస్: అమెరికాకు చెందిన ప్రభుత్వ యూనివర్సిటీ కొలరాడో డెన్వర్ (CU Denver) తన విదేశీ క్యాంపస్‌ను హైదరాబాద్‌లో (Hyderabad) ఏర్పాటు చేయనుంది. క్యాంపస్‌ను నెలకొల్పేందుకు ఇప్పటికే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (UGC) నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LOI) పొందింది. వచ్చే ఏడాది ఆగస్టు నుంచి తరగతులు ప్రారంభించనుంది. దీంతో తెలంగాణలోనే (Telangana) కాకుండా భారత్‌లోనే క్యాంపస్ ఏర్పాటు కోసం అనుమతి పొందిన తొలి అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయంగా సీయూ డెన్వర్ నిలిచింది.
దేశంలో ఇప్పటికే ఎనిమిది విదేశీ యూనివర్సిటీలు తమ క్యాంపస్‌లకు అనుమతులు పొందాయి. మహారాష్ట్రలో నాలుగు, కర్ణాటక, హర్యానాలో రెండు చొప్పున ఉన్నాయి. ఇవి యూకే, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన విశ్వవిద్యాలయాలే. మరో 11 యూనివర్సిటీలు కూడా ప్రాథమిక అనుమతులను సాధించాయి. అయితే భారత్‌లో ఏర్పాటు కానున్న అమెరికా ప్రభుత్వ యూనివర్సిటీ సీయూ డెన్వర్ (University of Colorado Denver) మొదటిది కావడం గమనార్హం.

కాగా, 2027 ఆగస్టు నుంచి క్లాసులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బిజినెస్, అనలిటిక్స్, కంప్యూటింగ్, ఇంజినీరింగ్ వంటి అధిక డిమాండ్ ఉన్న రంగాల్లో కోర్సులను అందించనుంది. వర్సిటీ చాన్సలర్ కెన్నెత్ క్రిస్టెన్సెన్ మాట్లాడుతూ భారతీయ విద్యార్థులతో తమకున్న సుదీర్ఘ అనుబంధాన్ని ఈ క్యాంపస్ ద్వారా మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. వివిధ రంగాల్లో తమకున్న ప్రత్యేక అనుభవాన్ని భారత్‌లోని విద్యార్థులకు అందించే అవకాశం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- ●TGSP Constable | ఎర్రవల్లిలో టీజీఎస్పీ కానిస్టేబుల్ ఆత్మహత్య
- ●Comrade Kalyan Review | ప్రేమ కోసం కామ్రేడ్‌గా మారిన కళ్యాణ్ కథ
- ●Hyderabad | ఆరేండ్ల బిడ్డను హుస్సేన్‌సాగర్‌లో విసిరేసిన తల్లి..
- ●Stock Markets | ట్రంప్ ప్రకటన ఎఫెక్ట్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
- ●KTR | ఒక్క వ్యక్తిని కాపాడటానికి ఎందుకు ఇంత ఆరాటం? .. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తప్పుకోవాల్సిందే: కేటీఆర్
- ●Domestic Abuse | 15 ఏండ్లుగా చిత్రహింసలు.. భర్త మెడపై కాలుతో తొక్కి చంపిన భార్య

TGSP Constable | ఎర్రవల్లిలో టీజీఎస్పీ కానిస్టేబుల్ ఆత్మహత్య

Comrade Kalyan Review | ప్రేమ కోసం కామ్రేడ్‌గా మారిన కళ్యాణ్ కథ

Hyderabad | ఆరేండ్ల బిడ్డను హుస్సేన్‌సాగర్‌లో విసిరేసిన తల్లి..

Stock Markets | ట్రంప్ ప్రకటన ఎఫెక్ట్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..





