త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఒక్క వ్య‌క్తిని కాపాడటానికి ఎందుకు ఇంత ఆరాటం? .. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ త‌ప్పుకోవాల్సిందే: కేటీఆర్

KTR | రాజ్యాంగం (Constitution) కంటే ఒక వ్యక్తి గొప్పవాడు కాదని, ఒక వ్యక్తిని కాపాడేందుకు ఎందుకు ఇంత ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్ (Gyanesh Kumar) పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు.

G

Telangana | Published On Oct 9, 2026, 9.27 am IST

KTR | ఒక్క వ్య‌క్తిని కాపాడటానికి ఎందుకు ఇంత ఆరాటం? .. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ త‌ప్పుకోవాల్సిందే: కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర న్యూస్‌: రాజ్యాంగం (Constitution) కంటే ఒక వ్యక్తి గొప్పవాడు కాదని, ఒక వ్యక్తిని కాపాడేందుకు ఎందుకు ఇంత ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్ (Gyanesh Kumar) పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియలో చోటుచేసుకున్న తీవ్ర‌మైన అక్ర‌మాల‌పై అక్రమాలపై సుప్రీంకోర్టు (Supreme Court) సుమోటోగా విచారణ చేపట్టాలని కోరారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్య‌తిరేకంగా శ‌నివారం రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ఎదుట నిరసనకు పిలుపునిచ్చారు.

`ఏ వ్యక్తి కూడా వ్యవస్థ కంటే గొప్పవారు కాదు. ఏ భార‌తీయ పౌరుడిని కూడా వారి ఓటు హ‌క్కును కోల్పోయేలా చేయ‌డానికి వీల్లేదు. జ్ఞానేశ్ కుమార్ త‌ప్పుకోవాల్సిందే. ఒక్క వ్య‌క్తిని కాపాడుకోవ‌డానికి ఎందుకు ఇంత ఆరాటం?. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఒక వ్యక్తి ఎలా గొప్పవాడవుతాడు. దేశం ఎంతోమంది వ్యక్తులను చూసింది. ఎంతో మంది వ‌చ్చారు, వెళ్లారు. కానీ ఈ దేశం తన బలాన్ని నిలబెట్టుకుంది. దేశ ఆత్మ‌ను దేబ్బ‌తీసేలా ప్ర‌త్యామ్నాయ వ్య‌వ‌స్థ‌ల‌ను సృష్టించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న ఎవ‌రికైనా స‌మ‌యం ముగిసింది.

ఎస్ఐఆర్‌ ప్రక్రియలో చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్న అక్రమాలపై సుప్రీంకోర్టు వెంట‌నే సుమోటోగా స్వీక‌రించి విచారణ చేపట్టాలి. సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జి నేతృత్వంలో ఈ ప్ర‌క్రియ‌పై ఓ స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాల‌ని బీఆర్‌ఎస్ (BRS) తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యానికి మూల‌స్తంభ‌మైన ఓటు హ‌క్కును కాల‌రాసే కుట్ర‌ల‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌గాలి` అని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement
Advertisement