Mudigonda Sivaprasad | చారిత్రక నవలా చక్రవర్తి ముదిగొండ శివప్రసాద్ ఇకలేరు!
Mudigonda Sivaprasad | హైదరాబాద్: ప్రముఖ రచయిత, చారిత్రక నవలా చక్రవర్తి ముదిగొండ శివప్రసాద్ (85) కన్నుమూశారు. కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం రాత్రి 8.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సాహిత్య రంగంలో విషాదం అలుముకున్నది.
Mudigonda Sivaprasad | హైదరాబాద్: ప్రముఖ రచయిత, చారిత్రక నవలా చక్రవర్తి ముదిగొండ శివప్రసాద్ (85) కన్నుమూశారు. కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం రాత్రి 8.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సాహిత్య రంగంలో విషాదం అలుముకున్నది. 1940 డిసెంబర్ 23న ప్రకాశం జిల్లా ఆకుల్లూరులో జన్మించిన ముదిగొండ శివప్రసాద్ ఎంఏ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. సికింద్రాబాద్‌లోని వెస్లీ హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా సేవలందించారు.
ముదిగొండ శివప్రసాద్ ప్రధానంగా చారిత్రక నవలా రచయితగా తెలుగు సాహిత్యంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చారిత్రక నేపథ్యాన్ని తీసుకుని ఆయా కాలాల్లోని సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులను తన రచనల్లో ప్రతిబింబించారు. మొత్తం 83 పుస్తకాలు రాశారు. వీటిలో 20కి పైగా చారిత్రక నవలలు ఉన్నాయి. శ్రీపదార్చన, ఆవాహన, పట్టాభి, రెసిడెన్సీ, శ్రీలేఖ, శ్రావణి, వంశధార, తంజావూరు విజయం, మహాసర్గ, బసవగీత, సమ్రాట్ పుష్యమిత్ర, సగం విరిగిన చంద్రుడు తదితర రచనలు ఆయన సాహిత్య ప్రస్థానంలో ఉన్నాయి. చారిత్రక నవలల ద్వారా పాఠకులను గత కాలంలోకి తీసుకెళ్లవచ్చని ఆయన భావించేవారు. చరిత్రను కేవలం గతానికి సంబంధించిన అంశంగా కాకుండా.. వర్తమానాన్ని అర్థం చేసుకునే సాధనంగా తన రచనల్లో చూపించారు. చరిత్ర, సంస్కృతి, సామాజిక అంశాలను కథనంలో మేళవించడం ఆయన రచనల్లో ప్రధానంగా కనిపిస్తుంది.
రచయితగా కొనసాగుతూనే సాహిత్య, సామాజిక రంగాల్లోనూ చురుకుగా ఉన్నారు. జ్యేష్ఠ కార్యకర్తగా వివిధ కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యారు.
ముదిగొండ శివప్రసాద్ అంత్యక్రియలు శుక్రవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు ముదిగొండ ఇందుశేఖర్ తెలిపారు. ఆయన మృతికి పలువురు సాహిత్యవేత్తలు, రచయితలు, సన్నిహితులు సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...
- ●K Kavitha | చిత్రపురి అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలి : కల్వకుంట్ల కవిత

CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్రెడ్డి

KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్డౌన్!

OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ





