Domestic Abuse | 15 ఏండ్లుగా చిత్రహింసలు.. భర్త మెడపై కాలుతో తొక్కి చంపిన భార్య
Domestic Abuse | మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగొచ్చి భార్యా పిల్లలను (Domestic Abuse) వేధిస్తున్నాడు. ఇలా రెండు కాదు మూడు కాదు.. 15 ఏండ్లుగా సాగుతున్నది. దీంతో విసిగి వేసారిన భార్య.. పూటుగా తాగొచ్చి నిద్ర మత్తులోకి జారుకున్న అతడిని మెడపై కాలుతో తొక్కి చంపేసింది (Murder).
Domestic Abuse | త్రినేత్ర న్యూస్: మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగొచ్చి భార్యా పిల్లలను (Domestic Abuse) వేధిస్తున్నాడు. ఇలా రెండు కాదు మూడు కాదు.. 15 ఏండ్లుగా సాగుతున్నది. దీంతో విసిగి వేసారిన భార్య.. పూటుగా తాగొచ్చి నిద్ర మత్తులోకి జారుకున్న అతడిని మెడపై కాలుతో తొక్కి చంపేసింది (Murder). ఈ ఘటన ఒడిశాలోని (Odisha) కేంద్రపారా జిల్లా మాలపట్న గ్రామంలో చోటుచేసుకుంది.
మాలపట్న గ్రామానికి చెందిన నిరంజన్ సాహు, మనోరమ భార్యభర్తలు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మద్యానికి బానిసైన (Alcohol Addict) నిరంజన్.. రోజూ తాగి వచ్చి భార్యా, పిల్లలను వేధిస్తున్నాడు. పది 15 ఏండ్లుగా ఇదే తంతు నడుస్తున్నది. దీంతో గృహ హింస తట్టుకోలేక ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. రోజూలానే బుధవారం రాత్రి కూడా తాగి వచ్చిన అతడు.. నిద్రకు ఉపక్రమించాడు. ఆ సమయంలో మెడపై కాలుతో తొక్కి చంపేసింది. గురువారం ఉదయం ఇంటి బయట నిరంజన్ విగత జీవిగా పడిఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.
విచారణలో నిరంజన్‌ను తానే చంపినట్లు మనోరమ అంగీకరించింది. తన మద్యానికి బానిసయ్యాడని, తాగి వచ్చి తనను, పిల్లలను తరచూ శారీరకంగా వేధించేవాడని (Domestic Dispute) పేర్కొంది. ఈ వేధింపులు గత 10 నుంచి 15 ఏళ్లుగా సాగుతున్నాయని కన్నీరుమున్నీరైంది. ఓ హోటల్‌లో గిన్నెలు కడుగుతూ వచ్చిన డబ్బుతో పిల్లలను పోషిస్తున్నానని తెలిపింది. గతంలో భర్త వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతను అరెస్ట్ అయి మూడు నెలల పాటు జైల్లో ఉన్నాడని, ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడని వివరించింది. భర్తను చంపితేనే ఈ నిరంతర వేధింపులకు తొలగిపోతాయనే చంపినట్లు తెలిపింది. తనకు కొడుకు, మైనర్ కూతురు కూడా సహాయం చేశారని పేర్కొంది. అయితే పిల్లల పాత్రపై స్పష్టత లేకపోవడంతో.. లోతుగా విచారణ జరుపుతున్నారు. నిరంజన్ మరణానికి దారితీసిన పరిస్థితులు, ఘటనకు ముందు ఇంట్లో ఏం జరిగిందనే కోణంలో విచారిస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల కచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు.
సంబంధిత వార్తలు

Vikarabad | వికారాబాద్లో మహిళ అదృశ్యం.. నారాయణపేటలో సగం కాలిన స్థితిలో మృతదేహం..
అక్టోబర్ 4, 2026

Murder | నలుగురు పిల్లల తల్లికి వేధింపులు.. పుట్టింటికి పిలిచి చున్నీతో ఉరేసిన వివాహిత
సెప్టెంబర్ 29, 2026

Cab Driver | దారిమళ్లించి.. నిర్మానుష్య ప్రాంతంలో.. ప్రయాణికురాలిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం
సెప్టెంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు
- ●POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు
- ●Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు

POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?



