త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Renukaswami Case | జైలులో హీరో ద‌ర్శ‌న్ ఆత్మ‌హ‌త్య ప్ర‌య‌త్నం అంటూ వార్త‌లు.. ఖండించిన హోం మంత్రి..!

Renukaswami Case | బెంగళూరు సెంట్రల్ జైల్లో రేణుకాస్వామి హత్య కేసులో రిమాండ్‌లో ఉన్న కన్నడ నటుడు ద‌ర్శ‌న్ తూగుదీప ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించార‌ని వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. ఈ వార్త‌ల‌ను క‌ర్నాట‌క హోంశాఖ మంత్రి జీ ప‌ర‌మేశ్వ‌ర తీవ్రంగా ఖండించారు.

P

Entertainment | Published On May 23, 2026, 7.54 pm IST

Renukaswami Case | జైలులో హీరో ద‌ర్శ‌న్ ఆత్మ‌హ‌త్య ప్ర‌య‌త్నం అంటూ వార్త‌లు.. ఖండించిన హోం మంత్రి..!
Advertisement

Renukaswami Case | బెంగళూరు సెంట్రల్ జైల్లో రేణుకాస్వామి హత్య కేసులో రిమాండ్‌లో ఉన్న కన్నడ నటుడు ద‌ర్శ‌న్ తూగుదీప ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించార‌ని వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. ఈ వార్త‌ల‌ను క‌ర్నాట‌క హోంశాఖ మంత్రి జీ ప‌ర‌మేశ్వ‌ర తీవ్రంగా ఖండించారు. దర్శన్ ఆత్మహత్య ప్రయత్నం చేశారంటూ సాగుతున్న ప్ర‌చారంలో నిజం లేద‌న్నారు. వార్త‌ల‌న్నీ నిరాధార‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. జైలు అధికారులే ఆయన ఆరోగ్యాన్ని నేరుగా పరిశీలించారని, ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. రేణుకాస్వామి హత్య కేసులో సుప్రీంకోర్టు గ‌తేడాది నటుడు దర్శన్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఏడాది వరకు మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే జైలులో ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించారన్న వార్తలు సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. అయితే, ఈ వార్తలను హోం మంత్రి పూర్తిగా ఖండించారు. అలాంటి ఘటన ఏదీ జరగలేదన్నారు. అధికారులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దీనిపై మాట్లాడేందుకు ఏమీ లేద‌న్నారు. డీజీపీ అలోక్ కుమార్ సైతం వ‌దంతుల‌ను ఖండించారు. బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్న దర్శన్ ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. దర్శన్ తనకు తానే హాని చేసుకోవాలని ప్రయత్నించారన్న ప్రచారం పూర్తిగా అస‌త్య‌మ‌ని, ఆయన బాగానే ఉన్నార‌ని డీజీపీ తెలిపారు. క‌న్న‌ట స్టార్ న‌టుడి ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు రాష్ట్ర ఉన్నతాధికారులు తెరదించారు. అభిమాని రేణుక స్వామి హ‌త్య కేసులో ద‌ర్శ‌న్, ఆయ‌న ప్రియురాలు ప‌విత్ర‌గౌడ సైతం జైలులో ఉన్న విష‌యం తెలిసిందే.

Advertisement
Advertisement