Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు అలర్ట్..
Gold And Silver Prices Today | అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో గత వారం రోజుల నుంచి నష్టాలు వస్తున్నప్పటికీ బంగారం, వెండి ధరల్లో కాస్త పెరుగుదల కనిపిస్తోంది. మధ్య ప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులు సేఫ్ హావెన్ ఆస్తుల వైపు మళ్లీ ఆసక్తి చూపిస్తున్నారు. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గడం ఇందుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.
Gold And Silver Prices Today | అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో గత వారం రోజుల నుంచి నష్టాలు వస్తున్నప్పటికీ బంగారం, వెండి ధరల్లో కాస్త పెరుగుదల కనిపిస్తోంది. మధ్య ప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులు సేఫ్ హావెన్ ఆస్తుల వైపు మళ్లీ ఆసక్తి చూపిస్తున్నారు. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గడం ఇందుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని, భారీ ఎత్తున కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు మార్కెట్ ఒడిదుడుకులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లలో బంగారం ధరలు క్రితం సెషన్ ముగింపులో భారీగా పెరిగాయి. ఔన్స్ బంగారం ధర 0.08 శాతం మేర పెరిగి 4,052 డాలర్లకు చేరగా, వెండి ధర 1 శాతం మేర ఎగబాకి 58 డాలర్లకు చేరింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 285 పాయింట్ల మేర స్వల్పంగా పెరిగి 1,43,106 వద్ద ముగియగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2,763 పాయింట్ల మేర పెరిగి 2,22,138 వద్ద స్థిరపడింది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా, వెండి ధరలు భారీగా పెరిగాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,493 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,15, 944గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,44,930 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,49,300 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.6వేలు పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,285 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,06,280గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,32,850 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,28,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.5,500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,870 ఉండగా, 8 గ్రాముల ధర రూ.86,960గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,08,700 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,87,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.4,500 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,40,000 ఉండగా, తులం ధర రూ.2,400గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.5వేలు పెరిగింది. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,40,000 ఉండగా, తులం ధర రూ.2,400 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | యుద్ధం ఎఫెక్ట్.. పెట్టుబడిదారుల్లో ఆందోళన.. భారీగా పతనమైన బంగారం ధరలు..
జులై 24, 2026

Gold And Silver Prices Today | బంగారానికి మళ్లీ పెరుగుతున్న డిమాండ్.. పెట్టుబడులకు ఇదే మంచి చాన్స్..?
జులై 23, 2026

Karimnagar Robbery | కరీంనగర్ భారీ దోపిడీ కేసులో ట్విస్ట్
జులై 22, 2026
తాజావార్తలు
- ●NMDC Recruitment | ఎన్ఎండీసీ స్టీల్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు..
- ●Maruti Suzuki | కొత్త బ్రెజ్జా వచ్చేసింది.. టర్బో ఇంజిన్‌తో మారుతి భారీ అప్డేట్..
- ●WhatsApp | వాట్సాప్ అప్డేట్.. ఐప్యాడ్ రిజిస్ట్రేషన్ నుంచి మ్యూజిక్ స్టేటస్ వరకు కొత్త ఫీచర్లు..
- ●BC Study Circle | పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్నారా?.. ఉచిత కోచింగ్, ప్రతి నెల స్టైపెండ్ కూడా.. ఎక్కడంటే?
- ●Sangareddy | పదేపదే ఫోన్ చేస్తున్నాడని.. భర్త నంబర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టిన భార్య.. అవమానంతో..
- ●SSCTU | సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో యూజీ కోర్సుల్లో ప్రవేశాలు

NMDC Recruitment | ఎన్ఎండీసీ స్టీల్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు..

Maruti Suzuki | కొత్త బ్రెజ్జా వచ్చేసింది.. టర్బో ఇంజిన్‌తో మారుతి భారీ అప్డేట్..

WhatsApp | వాట్సాప్ అప్డేట్.. ఐప్యాడ్ రిజిస్ట్రేషన్ నుంచి మ్యూజిక్ స్టేటస్ వరకు కొత్త ఫీచర్లు..

BC Study Circle | పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్నారా?.. ఉచిత కోచింగ్, ప్రతి నెల స్టైపెండ్ కూడా.. ఎక్కడంటే?



