త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

VC Sajjanar | మాటలు నమ్మొద్దు.. ఇందిరమ్మ ఇండ్ల‌ పేరుతో సైబర్ మోసాలు: వీసీ స‌జ్జ‌నార్

VC Sajjanar | హైద‌రాబాద్‌లో ఔంట‌ర్ రింగ్ రోడ్డు వ‌ర‌కు ఉన్న కోర్ అర్బ‌న్ రీజియ‌న్ ఎకాన‌మీ (క్యూర్‌) ప‌రిధిలో ప్ర‌భుత్వం ఇందిర‌మ్మ ఇండ్లు (Indiramma Indlu) నిర్మిస్తున్న‌ది. ప్ర‌స్తుతం ద‌రఖాస్తు ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ది. దీనిని ఆస‌రాగా చేసుకుని సైబ‌ర్ క్రిమిన‌ళ్లు (Cyber Frauds) అమాయ‌క ప్ర‌జ‌ల‌ను బురిడీ కొట్టిస్తున్నారు.

G

Flash news | Published On Jul 26, 2026, 4.51 pm IST

VC Sajjanar | మాటలు నమ్మొద్దు.. ఇందిరమ్మ ఇండ్ల‌ పేరుతో సైబర్ మోసాలు: వీసీ స‌జ్జ‌నార్
Advertisement

VC Sajjanar | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లో ఔంట‌ర్ రింగ్ రోడ్డు వ‌ర‌కు ఉన్న కోర్ అర్బ‌న్ రీజియ‌న్ ఎకాన‌మీ (క్యూర్‌) ప‌రిధిలో ప్ర‌భుత్వం ఇందిర‌మ్మ ఇండ్లు (Indiramma Indlu) నిర్మిస్తున్న‌ది. ప్ర‌స్తుతం ద‌రఖాస్తు ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ది. దీనిని ఆస‌రాగా చేసుకుని సైబ‌ర్ క్రిమిన‌ళ్లు (Cyber Frauds) అమాయ‌క ప్ర‌జ‌ల‌ను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ (VC Sajjanar) హెచ్చ‌రించారు. రూ.10,000 ఈఎండీ (EMD) చెల్లింపుల పేరుతో నకిలీ కాల్స్​, లింకుల ద్వారా మోసాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. డబ్బులు చెల్లిస్తే ఇండ్లు ఇప్పిస్తామని మాయగాళ్లు చెప్పే మాటలు నమ్మొద్దని సూచించారు. ఈరోజే చివరి తేదీ అని భయపెట్టి డబ్బులు కాజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రజలు అలాంటి వాటిని నమ్మవద్దన్నారు. వాట్సాప్, ఎస్​ఎంఎస్​లలో వచ్చే అపరిచిత లింకులు, ఏపీకే ఫైళ్లను డౌన్‌లోడ్ చేయవద్దని కోరారు. ఎనీ డెస్క్​, టీమ్​ వ్యూయర్​ వంటి స్క్రీన్​ షేరింగ్​ యాప్​లను ఇన్​స్టాల్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. రీఫండ్ కోసం యూపీఐ పిన్ అవసరం లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ ఆ వివరాలు చెప్పొద్దని సూచించారు.

ఆధార్, బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలు, ఓటీపీ లాంటివి అపరిచితులతో పంచుకోవద్దని సజ్జనర్ హెచ్చరించారు. ఇండ్ల‌ కేటాయింపు ప్రక్రియ పూర్తిగా పారద్శకంగా జరుగుతుందని, దళారులకు ఎలాంటి అవకాశం లేదన్నారు. ఇళ్లను కేటాయించకపోతే ఈఎండీ మొత్తాన్ని ప్రభుత్వమే దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతాలోకి తిరిగి జమ చేస్తుందన్నారు. సైబర్ మోసానికి గురైనట్లయితే 1930కు కాల్ చేయాలని లేదా Cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.

Advertisement
Advertisement