త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UP Viral Wedding | వింత వివాహం: విడిపోలేక ఒకే వ్యక్తిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. నెట్టింట హాట్ టాపిక్!

యూపీలోని అమ్రోహాలో వింత ఘటన. విడిపోవడం ఇష్టంలేక ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో వెనుక అసలు కథ ఇదే!

J

Viral news | Published On Jul 26, 2026, 4.51 pm IST

UP Viral Wedding | వింత వివాహం: విడిపోలేక ఒకే వ్యక్తిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. నెట్టింట హాట్ టాపిక్!
Advertisement
  • ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే యువకుడిని గుడిలో వివాహం చేసుకున్న వీడియో వైరల్
  • పెళ్లి తర్వాత ఒకరికొకరు దూరం కావడం ఇష్టం లేక, తమ కెమెరామెన్‌నే ముగ్గురూ పెళ్లాడినట్లు వెల్లడి
  • ఇది సోషల్ మీడియా రీల్స్ కోసం చేసిన ఫేక్ పెళ్లి కాదని, తామంతా మేజర్లమని స్పష్టీకరణ
  • హిందూ వివాహ చట్టం ప్రకారం ఇది నేరమంటూ సోషల్ మీడియాలో చట్టబద్ధతపై తీవ్ర చర్చ

UP Viral Wedding | త్రినేత్ర.న్యూస్ : ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా (Amroha) జిల్లాలో జరిగిన ఒక వింత వివాహం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ముగ్గురు అక్కచెల్లెళ్లు.. పెళ్లి తర్వాత విడిపోవడం ఇష్టం లేక ఒకే వ్యక్తిని పెళ్లాడారు. ఒకే మండపంలో ముగ్గురు యువతులు ఒకే యువకుడితో ఏడడుగులు వేసిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో దీనిపై పెద్ద చర్చే నడుస్తోంది.

వీడియోలో ఏముంది.. అసలు వీరెవరు?

అమ్రోహా జిల్లా డోరియా గ్రామానికి చెందిన సరోజ్, సావిత్రి, సంతోష్ అనే ముగ్గురు యువతులు ఒక గుడిలో వికాస్ అలియాస్ విక్కు అనే యువకుడిని సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. వీడియోలో వికాస్ ముగ్గురు వధువులకు సింధూరం పెట్టడం.. అగ్ని సాక్షిగా ప్రదక్షిణలు చేయడం కనిపిస్తుంది. రిపోర్టుల ప్రకారం.. వీరిలో ఇద్దరు సొంత అక్కచెల్లెళ్లు కాగా, మరొకరు కజిన్. ఈ ముగ్గురూ కలిసి చేసే సోషల్ మీడియా వీడియోలకు వికాస్ కెమెరామెన్‌గా పనిచేస్తున్నాడు. గత ఆరు నెలలుగా వారి వీడియోల్లో అతనే ఆన్‌-స్క్రీన్ భర్తగా కూడా నటిస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Rajput girl (@ak_rajput9990)

ఒకే వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు?

మొదట ఇదంతా సోషల్ మీడియా కంటెంట్ లేదా రీల్స్ (Reels) కోసం చేసిన ఫేక్ పెళ్లి అని నెటిజన్లు అనుకున్నారు. కానీ, ఆ నలుగురు స్వయంగా కెమెరా ముందుకు వచ్చి ఇది నిజమైన పెళ్లేనని స్పష్టం చేశారు.

"మేము చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాం. మా ఇళ్లలో వేరే పెళ్లి సంబంధాలు చూస్తుంటే.. విడిపోవాల్సి వస్తుందని భయపడ్డాం. ఒక దశలో చనిపోదామని కూడా అనుకున్నాం. కానీ చివరకు ముగ్గురం కలిసే ఉండాలని నిర్ణయించుకుని వికాస్‌ను పెళ్లాడాం. మేమంతా మేజర్లం. మా ఇష్టపూర్వకంగానే, పరస్పర అంగీకారంతోనే (Mutual consent) ఈ నిర్ణయం తీసుకున్నాం. మమ్మల్ని ట్రోల్ చేయడం ఆపండి" అని వారు వివరించారు. ఈ ముగ్గురి బంధాన్ని అర్థం చేసుకునే తాను ఈ పెళ్లికి ఒప్పుకున్నట్లు వికాస్ తెలిపాడు.

ఆలయ కమిటీ ఏమంటోంది?

ఈ పెళ్లి హసన్‌పూర్‌లోని మా చాముండ ఆలయంలో జరిగినట్లు వీడియోల ద్వారా తెలుస్తోంది. అయితే, గుడిలో జరుగుతున్న రెనోవేషన్ (Renovation) పనుల వల్ల అక్కడ పూజారులు గానీ, సిబ్బంది గానీ ఎవరూ లేరని, ఈ పెళ్లి గురించి తమకేమీ తెలియదని ఆలయ కమిటీ స్పష్టం చేసింది.

చట్టం ఏం చెబుతోంది? ఇది లీగలేనా?

ఈ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టడంతో లీగల్ అండ్ సోషల్ డిబేట్ మొదలైంది. హిందూ సంఘాలు ఈ పెళ్లి చట్టబద్ధతను, ఆచారాలను ప్రశ్నిస్తున్నాయి. కొందరు మాత్రం వాళ్లు మేజర్లు కాబట్టి వారి వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించాలని సపోర్ట్ చేస్తున్నారు. నెట్టింట వస్తున్న విమర్శలపై ఆ సిస్టర్స్ స్పందిస్తూ.. "పురాణాల్లో దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు లేరా? దాన్ని అవమానంగా భావిస్తారా?" అని ప్రశ్నించడం గమనార్హం.

అయితే, హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం బహుభార్యత్వం (Polygamy) చెల్లదు. చట్టం ప్రకారం సెక్షన్ 5 కింద.. మొదటి భార్య బతికి ఉండగా లేదా విడాకులు తీసుకోకుండా మరో మహిళను పెళ్లి చేసుకోవడం చెల్లదు. ఇది భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 82 (గతంలో ఐపీసీ సెక్షన్ 494) ప్రకారం నేరం. దీని కింద క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Rajput girl (@ak_rajput9990)

 

View this post on Instagram

 

A post shared by Rajput girl (@ak_rajput9990)

Advertisement
Advertisement