త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | యుద్ధం ఎఫెక్ట్‌.. పెట్టుబ‌డిదారుల్లో ఆందోళ‌న‌.. భారీగా ప‌త‌న‌మైన బంగారం ధ‌ర‌లు..

Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో కొన‌సాగుతున్న యుద్ధం కార‌ణంగా ఈక్విటీ మార్కెట్లు కుదేల‌వుతున్నాయి. అమెరికా, ఇరాన్‌ల మ‌ధ్య అంత‌కు ముందు క‌న్నా భీక‌ర రీతిలో యుద్ధం కొన‌సాగుతోంది. దీంతో ఇంధ‌న స‌ర‌ఫ‌రాకు ఆటంకం క‌లుగుతుంద‌నే ఆందోళ‌న‌లు పెట్టుబ‌డిదారుల‌ను వెంటాడుతున్నాయి.

S

Business | Published On Jul 24, 2026, 11.05 am IST

Gold And Silver Prices Today | యుద్ధం ఎఫెక్ట్‌.. పెట్టుబ‌డిదారుల్లో ఆందోళ‌న‌.. భారీగా ప‌త‌న‌మైన బంగారం ధ‌ర‌లు..
Advertisement

Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో కొన‌సాగుతున్న యుద్ధం కార‌ణంగా ఈక్విటీ మార్కెట్లు కుదేల‌వుతున్నాయి. అమెరికా, ఇరాన్‌ల మ‌ధ్య అంత‌కు ముందు క‌న్నా భీక‌ర రీతిలో యుద్ధం కొన‌సాగుతోంది. దీంతో ఇంధ‌న స‌ర‌ఫ‌రాకు ఆటంకం క‌లుగుతుంద‌నే ఆందోళ‌న‌లు పెట్టుబ‌డిదారుల‌ను వెంటాడుతున్నాయి. దీని వ‌ల్ల చ‌మురు ధ‌ర‌లు భారీగా పెర‌గ్గా పెట్టుబ‌డిదారులు సేఫ్ హావెన్ ఆస్తుల వైపు కూడా మొగ్గు చూప‌డం లేదు. అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో బంగారం, వెండి ధ‌ర‌లు మ‌ళ్లీ భారీగా ప‌త‌న‌మయ్యాయి. శుక్ర‌వారం ఔన్స్ బంగారం ధ‌ర 0.55 శాతం మేర త‌గ్గి 4,027 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 0.26 శాతం త‌గ్గి 57 డాల‌ర్ల‌కు వ‌చ్చింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 920 పాయింట్లు ప‌త‌న‌మై 1,41,901 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 895 పాయింట్లు త‌గ్గి 2,18,480 వ‌ద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా ప‌త‌న‌మ‌య్యాయి.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,433 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,15, 464గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,44,330 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,43,300 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.18,500 త‌గ్గింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,230 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,05,840గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,32,300 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,23,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.17వేలు త‌గ్గింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.10,825 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.86,600గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,08,250 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.10,82,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.13,900 త‌గ్గింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,35,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,350గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర కిలోకు రూ.5వేలు త‌గ్గింది. హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,40,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,400 గా ఉంది.

Advertisement
Advertisement