CM Revanth Reddy | మద్దతు ధరతో మక్కలను కొంటున్నం.. సీపీఎం నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy | సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నేతృత్వంలోని సీపీఎం బృందం సోమవారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా కనీస వేతనాల సవరణ చట్టాన్ని తీసుకురావడంపై ముఖ్యమంత్రికి సీపీఎం నాయకులు ధన్యవాదాలు తెలిపారు.
CM Revanth Reddy | సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నేతృత్వంలోని సీపీఎం బృందం సోమవారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా కనీస వేతనాల సవరణ చట్టాన్ని తీసుకురావడంపై ముఖ్యమంత్రికి సీపీఎం నాయకులు ధన్యవాదాలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, పీ సుదర్శన్, జ్యోతి, నున్నా నాగేశ్వరరావు, మల్లు లక్ష్మి, సామినేని స్వరాజ్యం, ఎం గోపాలరావు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపై సీపీఎం నేతలతో మాట్లాడారు. రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ, మద్దతు ధరలు ప్రకటించినప్పటికీ కేంద్రం గింజ కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. పండిన పంటలో 30 శాతం కూడా సేకరణ జరగడం లేదన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు.
సన్న వడ్లకు రూ.500 బోనస్
సన్న వడ్ల కొనుగోలుకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామని, మొక్కజొన్నను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల కారణంగా హమాలీల కొరత ఏర్పడిందని, తీవ్ర ఎండల వల్ల మధ్యాహ్న సమయంలో పనులు మందగిస్తున్నాయని చెప్పారు. అయినప్పటికీ కొనుగోళ్లపై నిరంతరం సమీక్ష కొనసాగుతోందన్నారు. మూసీ ప్రాజెక్టుపై కూడా సీఎం స్పందించారు. మూసీ నిర్వాసితులకు స్థానికంగానే నివాసాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మూసీ అంశంపై బీఆర్‌ఎస్, బీజేపీలు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. మూసీని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని, ఈ ప్రాజెక్ట్ ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
ఆరుట్ల స్కూల్‌ను సందర్శించండి..
మూసీ కాలుష్యం కారణంగా నల్గొండ జిల్లా ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేసిన సీఎం, నగర ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే తన ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని పేర్కొన్న ఆయన, విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం, భోజనం అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఆరుట్ల స్కూల్‌ను సీపీఎం నాయకులు ఒకసారి సందర్శించాలని సీఎం రేవంత్ సూచించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CP Sajjanar | బక్రీద్ వేళ నకిలీ యాప్‌లతో మోసాలు.. వ్యాపారులను హెచ్చరించిన సీపీ సజ్జనార్
మే 26, 2026

MLA Rajagopal Reddy | రైతన్నలూ.. క్షమించండి.. పది రోజుల్లో మొత్తం ధాన్యం కొంటాం: ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
మే 26, 2026

Harbeer Singh | డ్రగ్స్ రాకెట్లో పంజాబీ సింగర్.. హర్బీర్ సింగ్ సోహైల్‌ను అరెస్టు చేసిన పోలీసులు..!
మే 26, 2026
తాజావార్తలు
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..
- ●India-Pakistan Border | విద్యుత్‌దీపాలతో వెలుగులీనుతున్న ఇండోపాక్ బోర్డర్.. ఆకట్టుకుంటున్న వీడియో

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?



