CPI Narayana | మోదీ.. ఇది యుద్ధ నీతి కాదు.. డీలిమిటేషన్ బిల్లుపై సీపీఐ నారాయణ ఆగ్రహం
CPI Narayana | మహిళలను అడ్డం పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని సీపీఐ నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో డీలిమిటేషన్ బిల్లును కలిపి ప్రవేశపెట్టడం యుద్ధ నీతి కాదంటూ మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
CPI Narayana | త్రినేత్ర.న్యూస్ : మహిళలను అడ్డం పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని సీపీఐ నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో డీలిమిటేషన్ బిల్లును కలిపి ప్రవేశపెట్టడం యుద్ధ నీతి కాదంటూ మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ బిల్లుపై సీపీఐ నారాయణ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
మోదీ ప్రభుత్వానికి నీతి, నియమం లేకుండా పోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లు న్యాయబద్ధమైంది. ఈ బిల్లు ఇప్పటికే పెండింగ్‌లో ఉంది. గీతా ముఖర్జి రాసిన రిపోర్టు రాజ్యసభలో ఆమోదించబడింది. ఇప్పుడు లోక్‌సభలో ఆమోదించాలి. దాన్ని ఆమోదించేందుకు మళ్లీ మధ్యలో డీలిమిటేషన్ బిల్లు పెడుతున్నారు. అంటే పాయసం ఇస్తూనే విషగుళికలు ఇచ్చి రెండు తాగండి అనే పద్ధతుల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్ బిల్లులో పెట్టి ఆమోదించండి అంటున్నారు. ఆమోదించకపోతే మహిళా వ్యతిరేకులు అని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మహిళలను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసే దుస్థితికి బీజేపీ వచ్చింది. డీలిమిటేషన్ బిల్లు అనేది ఫెడరల్ సిస్టమ్. భారతదేశం సమైక్యంగా ఉండాలా..? వద్దా..? ఉత్తర, దక్షిణ భారతదేశంగా మారిపోవాలా అనేది వేరు.. దానిపై చర్చ చేద్దాం. కానీ మహిళా బిల్లును మాత్రమే ఆమోదించండి.. ఆ తర్వాతనే డీలిమిటేషన్ బిల్లు. మహిళా బిల్లును అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడం యుద్ధ నీతి కాదు అని మోదీకి నారాయణ వార్నింగ్ ఇచ్చారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



