త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kunamneni Sambashiva Rao | ‘ఉపా’ చ‌ట్టం ఉండ‌గా.. ‘హేట్ స్పీచ్ బిల్లు’ ఎందుకు..? : కూనంనేని సాంబ‌శివ‌రావు

Kunamneni Sambashiva Rao | ఉపా చ‌ట్టం ఉండ‌గా.. హేట్ స్పీక్ బిల్లు ఎందుకు..? అని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబ‌శివ‌రావు నిల‌దీశారు. ఈ బిల్లు ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌కే విరుద్ధంగా ఉంది.. ప్ర‌భుత్వం పున‌రాలోచ‌న చేసి విత్ డ్రా చేసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్న‌ట్లు కూనంనేని సాంబ‌శివ‌రావు పేర్కొన్నారు.

S

Telangana | Published On Mar 30, 2026, 4.09 pm IST

Kunamneni Sambashiva Rao | ‘ఉపా’ చ‌ట్టం ఉండ‌గా.. ‘హేట్ స్పీచ్ బిల్లు’ ఎందుకు..? : కూనంనేని సాంబ‌శివ‌రావు
Advertisement

Kunamneni Sambashiva Rao | త్రినేత్ర‌.న్యూస్ : ఉపా చ‌ట్టం ఉండ‌గా.. హేట్ స్పీక్ బిల్లు ఎందుకు..? అని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబ‌శివ‌రావు నిల‌దీశారు. ఈ బిల్లు ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌కే విరుద్ధంగా ఉంది.. ప్ర‌భుత్వం పున‌రాలోచ‌న చేసి విత్ డ్రా చేసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్న‌ట్లు కూనంనేని సాంబ‌శివ‌రావు పేర్కొన్నారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ హేట్ స్పీచ్ బిల్లుపై కూనంనేని సాంబ‌శివ‌రావు మాట్లాడారు.

ఈ బిల్లును పూర్తిగా నేను వ్య‌తిరేకిస్తున్నాను. ఎందువల్ల అంటే రాజ‌కీయాల‌తో నిమిత్తం లేదు. భావ స్వేచ్ఛ‌కు సంబంధించి, అలాగే భాష‌కు సంబంధించి ఈ బిల్లు ఉంది. సాంస్కృతిక‌ రంగంపై అన్ని ర‌కాలుగా దాడులు చేసేందుకు ఉన్న బిల్లు ఇది. బ్రిటీష్ కాలంలో ఇలాంటి బిల్లులు ఉండేవి. ఏ అంశంపై కూడా ఈ బిల్లులో స్ప‌ష్ట‌త లేదు. ప్ర‌జాస్వామ్యాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం నిర్బంధించింది. ఇప్పుడు దానికి రాష్ట్రం తోడైంది. ఇక చెప్పుకోవ‌డానికి ఎవ‌రికి ఉండ‌దు అని కూనంనేని సాంబ‌శివ‌రావు పేర్కొన్నారు.

నోరు లేని వారిని లోప‌ల పెడుతున్నారు.. లేదంటే చంపేస్తున్నారు..

ఉపా చ‌ట్టం ఒకటి ఉంది. ఈ చ‌ట్టం కింద అరెస్టు అయిన వ‌ర‌వ‌ర‌రావు లోప‌లే ఉన్నారు. నోరు లేని వారిని అనేక‌మందిని లోప‌ల పెడుతున్నారు.. లేదంటే చంపేస్తున్నారు. ఎన్ఐఏ కింద వంద‌ల మందిని అరెస్టు చేస్తున్నారు. ఈ మ‌ధ్య‌లో మావోయిస్టు లీడ‌ర్ చ‌నిపోతే సంతాపం స‌భ పెట్టినందుకు సీపీఐ లీడ‌ర్ల మీద కేసులు పెట్టారు. నేను కూడా వెళ్దామ‌నుకున్నా కానీ వెళ్ల‌లేక‌పోయాను అని ఎమ్మెల్యే తెలిపారు.

ఉపా చ‌ట్టం స‌ప‌రిపోత‌ద‌ని నా భావ‌న‌..

ఒక మతంపై ఇంకో మ‌తాన్ని రుద్దే విష‌యంలో లేదా ఒక భాష‌పై ఇంకో భాష‌ను రుద్దే విష‌యంలో ఇది క‌రెక్టు కాద‌ని హేతువాది అంటే ఆయ‌న మీద కేసు పెడుతారు. రాముడు చెప్పింది ఇది కాదు అంటే కేసు పెడుతారు. బైబిల్ చెప్పిన సారాంశం వ‌క్రీక‌రిస్తున్నారని చెప్తే కేసు పెడుతారు. అసెంబ్లీలో బ‌య‌ట చూస్తున్నాం. పొలిటిక‌ల్ స‌భ‌ల్లో చూస్తున్నాం. ఘోరంగా తిట్టుకుంటున్నారు. ఆడ‌వారిని కూడా మెన్ష‌న్ చేస్తూ తిట్టుకుంటున్నారు. బాడీ షేమింగ్‌ కూడా చేస్తున్నారు. వీటిని కంట్రోల్ చేయ‌డానికి ఉన్న ఉపా చ‌ట్టం స‌ప‌రిపోత‌ద‌ని నా భావ‌న‌. ఈ బిల్లులో దేనిపై కూడా స్ప‌ష్టత లేదు అని కూనంనేని సాంబ‌శివ‌రావు పేర్కొన్నారు.

ఈ చ‌ట్టాన్ని విత్ డ్రా చేసుకోవాల‌ని కోరుతున్నా..

నా వాట్సాప్ ద్వారా ఏదైనా ఫార్వ‌ర్డ్ చేస్తే కూడా నా మీద కేసు అవుతది. బూతులు, మ‌తాన్ని తిడితే ఇప్పుడైనా కేసు పెట్టొచ్చు.. దానికి ప్ర‌త్యేకంగా చ‌ట్టం అవ‌స‌రం లేదు. బిల్లులోని సెక్ష‌న్ 5, సెక్ష‌న్ 8 రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. సీసీఐ నాయ‌కుడు ఒక‌రు ఆవేశంతో మాట్లాడితే.. మొత్తం పార్టీ మీద కేసు పెడుతారు. ఇదెక్క‌డి అన్యాయం. దీన్ని ఎవ‌రు త‌యారు చేశారో అర్థం కావ‌డం లేదు. ఇక ప్ర‌భుత్వ ఉద్యోగి ఏదైనా మాట్లాడొచ్చ‌ట‌.. కానీ కేసు ఉండ‌ద‌ట‌. ప్ర‌తి సెక్ష‌న్ లో కూడా స్ప‌ష్ట‌త లేదు. ప్ర‌జాస్వామ్యానికి వ్య‌తిరేకంగానే అనిపిస్తుంది ఈ బిల్లు. సెలెక్ట్ క‌మిటీకి కాకుండా ప్ర‌భుత్వ‌మే పున‌రాలోచ‌న చేసి ఈ చ‌ట్టాన్ని విత్ డ్రా చేసుకోవాల‌ని కోరుతున్నాను అని కూనంనేని సాంబ‌శివ‌రావు పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement