Jio Black Rock AMC | జియో బ్లాక్ రాక్ నుంచి మరో కొత్త ఫండ్.. చివరి తేదీ ఎప్పుడంటే..?
Jio Black Rock AMC | జియోబ్లాక్‌రాక్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఏఎంసీ) నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.22వేల కోట్లను దాటింది. ఈ ఏడాది మార్చిలో దాదాపు రూ.16వేల కోట్లుగా ఉన్న ఏయూఎం ఇప్పుడు గణనీయంగా పెరిగినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ విషయాన్ని పీటీఐ తెలియజేసింది.
Jio Black Rock AMC | జియోబ్లాక్‌రాక్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఏఎంసీ) నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.22వేల కోట్లను దాటింది. ఈ ఏడాది మార్చిలో దాదాపు రూ.16వేల కోట్లుగా ఉన్న ఏయూఎం ఇప్పుడు గణనీయంగా పెరిగినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ విషయాన్ని పీటీఐ తెలియజేసింది. ఈ సందర్భంగా జియోబ్లాక్‌రాక్ ఏఎంసీ ఓపెన్-ఎండెడ్ డైనమిక్ అసెట్ అలొకేషన్ పథకమైన జియోబ్లాక్‌రాక్ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌వో) సెప్టెంబర్ 11న ప్రారంభమై సెప్టెంబర్ 25న ముగియనుంది. జియోబ్లాక్‌రాక్ ఏఎంసీ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ (సీఐవో) రిషి కోహ్లీ మాట్లాడుతూ 2026-27 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఏయూఎం రూ.25వేల కోట్లను దాటుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరం సంస్థ కార్యకలాపాల తొలి సంవత్సరం అని చెప్పారు.
పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన..
ప్రస్తుతం ఏయూఎం ఇప్పటికే రూ.22వేల కోట్లకు చేరిందని, పెట్టుబడిదారుల నుంచి స్పందన ఆరోగ్యకరంగా కొనసాగుతోందని కోహ్లీ తెలిపారు. తమ వద్ద మరిన్ని ఉత్పత్తులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, ఈ ఏడాది ద్వితీయార్థంలో మరిన్ని ఫండ్ లాంచ్‌లతో కార్యకలాపాలు మరింత ఉత్సాహంగా ఉంటాయని పేర్కొన్నారు. కొత్త బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ దీర్ఘకాలిక మూలధన వృద్ధిని లక్ష్యంగా నిర్ణయించుకుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మారేలా ఈక్విటీ, డెట్ సాధనాల్లో పెట్టుబడులను డైనమిక్‌గా నిర్వహించనుంది. బ్లాక్‌రాక్‌కు చెందిన ప్రత్యేక పెట్టుబడి నమూనాలు, యాక్టివ్ ఫండ్ మేనేజ్‌మెంట్ సహకారంతో బెంచ్‌మార్క్ కంటే 3-4 శాతం అదనపు రాబడిని సాధించడమే లక్ష్యమని కోహ్లీ తెలిపారు.
చివరి తేదీ ఎప్పుడు..
జియోబ్లాక్‌రాక్ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఓపెన్-ఎండెడ్ డైనమిక్ అసెట్ అలొకేషన్ పథకంగా పనిచేయనుంది. ఇందులో డైనమిక్ అసెట్ అలొకేషన్ విధానం, సిస్టమాటిక్ ఈక్విటీ పోర్ట్‌ఫోలియో నిర్మాణం, క్రమశిక్షణ కలిగిన ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ వ్యూహాన్ని కలిపి అమలు చేయనున్నారు. మార్కెట్ ఎక్స్‌పోజర్‌ను నిర్వహించేందుకు, ఈక్విటీ ఆధారిత పన్ను ప్రయోజనాలను కొనసాగించేందుకు డెరివేటివ్స్‌ను కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఎన్‌ఎఫ్‌వో రెండు వారాల పాటు కొనసాగుతుంది. సెప్టెంబర్ 11న ప్రారంభమై సెప్టెంబర్ 25న ముగుస్తుంది. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పోర్ట్‌ఫోలియోను రూపొందించేందుకు విభిన్న పరిశోధన సమాచారాన్ని, సిస్టమాటిక్ పోర్ట్‌ఫోలియో నిర్మాణాన్ని, రిస్క్ మేనేజ్‌మెంట్ సామర్థ్యాలను వినియోగించనున్నట్లు కోహ్లీ తెలిపారు. ఈ కొత్త బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్‌తో జియోబ్లాక్‌రాక్ ఏఎంసీ ఉత్పత్తుల సంఖ్య 2026-27 నాటికి 17 నుంచి 20కి పైగా పెరగనుంది.
సిల్వర్ ఈటీఎఫ్‌లకు సైతం అనుమతి..
మొమెంటమ్ ఇండెక్స్ ఫండ్, లో వాలటిలిటీ ఇండెక్స్ ఫండ్‌లకు ఇప్పటికే నియంత్రణ సంస్థ అనుమతులు లభించాయని కోహ్లీ వెల్లడించారు. సిల్వర్ ఈటీఎఫ్ ప్రారంభించేందుకు కూడా ఏఎంసీకి అనుమతి వచ్చింది. అయితే ప్రస్తుతం వెండి ధరల్లో అధిక అస్థిరత కొనసాగుతున్న నేపథ్యంలో దాని ప్రారంభాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. అలాగే గిఫ్ట్ సిటీ కేంద్రంగా పనిచేసే సంస్థ ద్వారా అంతర్జాతీయ ఉత్పత్తిని కూడా ప్రారంభించేందుకు జియోబ్లాక్‌రాక్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇది డాలర్ విలువలో ఉండే విదేశీ గ్లోబల్ ఈక్విటీ ఉత్పత్తిగా ఉంటుందని తెలిపారు. జియోబ్లాక్‌రాక్ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్‌కు నిఫ్టీ 50 హైబ్రిడ్ కాంపోజిట్ డెట్ 50:50 ఇండెక్స్ బెంచ్‌మార్క్‌గా ఉంటుంది.
తాజావార్తలు
- ●Assembly | అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న మార్షల్స్
- ●Vande Mataram | వందేమాతరం పూర్తి ఆరుచరణాలను ఆలపించిన సీఎం ఒమర్ అబ్దుల్లా.. కాంగ్రెస్ అభ్యంతరం
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.10వేలు తగ్గిన బంగారం ధర.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
- ●BRS | మహిళా పోలీసులపై దురుసు ప్రవర్తన.. బీఆర్ ఎమ్మెల్యేలపై మరో కేసు
- ●BRS MLAs | సమావేశాలు ముగిసే వరకు.. శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
- ●Assembly Session | దళితులు ఆందోళన చేస్తే శుద్ధి చేస్తారా? .. మంత్రి అడ్లూరి ఆగ్రహం..

Assembly | అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న మార్షల్స్

Vande Mataram | వందేమాతరం పూర్తి ఆరుచరణాలను ఆలపించిన సీఎం ఒమర్ అబ్దుల్లా.. కాంగ్రెస్ అభ్యంతరం

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.10వేలు తగ్గిన బంగారం ధర.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..

BRS | మహిళా పోలీసులపై దురుసు ప్రవర్తన.. బీఆర్ ఎమ్మెల్యేలపై మరో కేసు



