MLC Deshapathi Srinivas | బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సస్పెండ్ చట్ట విరుద్ధం.. ఆ అధికారం చైర్మన్‌కు లేదు..
MLC Deshapathi Srinivas | తెలంగాణ శాసనసభకు, మండలికి ఇవాళ గ్రహణం పట్టిన రోజు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. మండలిలో బీఆర్ఎస్‌కు మెజార్టీ ఉన్నప్పటికీ.. కేవలం ఒక్క నిమిషంలోనే ఇద్దరు సభ్యులను సస్పెండ్ చేశారని ఆయన మండిపడ్డారు.
MLC Deshapathi Srinivas | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ శాసనసభకు, మండలికి ఇవాళ గ్రహణం పట్టిన రోజు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. మండలిలో బీఆర్ఎస్‌కు మెజార్టీ ఉన్నప్పటికీ.. కేవలం ఒక్క నిమిషంలోనే ఇద్దరు సభ్యులను సస్పెండ్ చేశారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను మండలి నుంచి సస్పెండ్ చేయటం చట్ట విరుద్ధం.. ఆ అధికారం చైర్మన్‌కు లేదని దేశపతి తెలిపారు.
రాష్ట్ర రాజకీయాలకు చీడ తగిలింది ఆ చీడ పేరు రేవంత్ రెడ్డి. ఈ రోజు చట్ట సభలకు గ్రహణం పట్టిన రోజు. ఐదు గంటలుగా సభను వాయిదా వేశారు. ఐదు గంటలు మేం ఎదురు చూశాం. సభ ప్రారంభం కాగానే మా సభ్యులను సస్పెండ్ చేయాలని తీర్మానం పెట్టారు. మెజారిటీగా మేము ఉన్నాం.. తీర్మానం వీగిపోతుంది. కేవలం ఒక్క నిమిషంలోనే ఇద్దరు సభ్యులను సస్పెండ్ చేశారు. ఇది చట్ట విరుద్ధమైన సస్పెండ్ అని దేశపతి పేర్కొన్నారు.
మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది కామన్ అయింది..
సభ బయట జరిగిన దానికి సస్పెండ్ చేసే అధికారం చైర్మన్‌కి లేదు. సభలో జరిగిన దానికి మాత్రమే సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది. ఏ రూల్ ప్రకారం సస్పెండ్ చేశారో అడిగితే మమ్మల్ని మార్షల్స్‌ను పెట్టీ బయటకు పంపారు. మా సభ్యుల మీద దాడులు చేస్తున్నారు. మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది కామన్ అయింది. పోలీసులు భౌతిక దాడులు చేస్తున్నారు. ఇది నీచమైన పద్దతి అని దుయ్యబట్టారు.
ప్రతిపక్ష సభ్యుల పీకలు నొక్కుతున్నారు
జుట్టు పట్టుకు లాగుతున్నారు.. మా మహిళ ఎమ్మెల్యే లు కన్నీరు పెట్టుకున్నారు.. మా ఎమ్మెల్యేల కన్నీటికి విలువ లేదా..? మా సభ్యులను ఏకపక్షంగా ఎలా సస్పెండ్ చేస్తారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చుతున్నారు.. ఇక్కడ మమల్ని బుల్డోజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని ఈ ప్రభుత్వం అణచివేతకు గురిచేస్తుంది. పాలిటెక్నిక్ పిల్లల పీకలు నొక్కుతున్నారు.. ఇక్కడ ప్రతిపక్ష సభ్యుల పీకలు నొక్కుతున్నారు అని దేశపతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రికి భాష గురించి మాట్లాడే హక్కు లేదు..
రాహుల్ గాంధీ నల్ల డ్రెస్ మీద మోదీ, అదానీ క్యారికేచర్ ఉంది.. నినాదాలు ఉన్నాయి.. రాహుల్ గాంధీకి ఒక న్యాయం.. మాకు ఒక న్యాయమా..?ఎవరి ఆదేశాల మేరకు మమల్ని సభలోకి రాకుండా అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి భాష మీద చర్చ జరగాలి అంటున్నారు. ముఖ్యమంత్రికి భాష గురించి మాట్లాడే హక్కు లేదు. సీఎం అసెంబ్లీలో బడివే అంటారు దానిమీద ఏం చర్యలు ఉండవా.. ఈ దమనకాండ నడవదు.. ప్రతిఘటిస్తాం.. మీ దమనకాండ ప్రజల ముందు బట్టబయలు అవుతుంది అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ex MLC Kavitha | రాజకీయ ప్రత్యర్థుల చావు కోరుకోవడం ఏంటి..? : మాజీ ఎమ్మెల్సీ కవిత
సెప్టెంబర్ 8, 2026

Madhusudhana Chary | మండలిలో మాదే మెజారిటీ.. ఆరుగురు సభ్యులున్న కాంగ్రెస్ ఎలా తీర్మానం పాస్ చేస్తుంది?
సెప్టెంబర్ 8, 2026

DK Aruna | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే.. ఎంపీ డీకే అరుణ డిమాండ్
సెప్టెంబర్ 8, 2026
తాజావార్తలు
- ●Madhusudhana Chary | మండలిలో మాదే మెజారిటీ.. ఆరుగురు సభ్యులున్న కాంగ్రెస్ ఎలా తీర్మానం పాస్ చేస్తుంది?
- ●DK Aruna | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే.. ఎంపీ డీకే అరుణ డిమాండ్
- ●RS Praveen Kumar | స్పీకర్‌ను ప్రతిసారీ అవమానిస్తున్నది కాంగ్రెస్సే: ఆర్ఎస్ ప్రవీణ్
- ●Telangana Assembly Resolution | కేసీఆర్ క్షమాపణకు అసెంబ్లీలో తీర్మానం
- ●RS Praveen Kumar | కేసీఆర్ హత్యకు రేవంత్‌రెడ్డి కుట్ర.. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు..!
- ●Legislative Council | బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

Madhusudhana Chary | మండలిలో మాదే మెజారిటీ.. ఆరుగురు సభ్యులున్న కాంగ్రెస్ ఎలా తీర్మానం పాస్ చేస్తుంది?

DK Aruna | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే.. ఎంపీ డీకే అరుణ డిమాండ్

RS Praveen Kumar | స్పీకర్‌ను ప్రతిసారీ అవమానిస్తున్నది కాంగ్రెస్సే: ఆర్ఎస్ ప్రవీణ్

Telangana Assembly Resolution | కేసీఆర్ క్షమాపణకు అసెంబ్లీలో తీర్మానం



