Nizamabad Mayor | ఎంఐఎంతో కుదిరిన పొత్తు.. నిజామాబాద్ మేయర్ పీఠంపై కాంగ్రెస్!
Nizamabad Mayor | మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ (Nizamabad)నగర ప్రజలు ఏ పార్టీకీ స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. దీంతో ఏ ఒక్క పార్టీ మెజార్టీ మార్కు దాటకపోవడంతో హంగ్ ఏర్పడింది. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మేయర్ (Nizamabad Mayor) పీఠం దక్కించుకోవడానికి కావాల్సిన సంఖ్యా బలం లేదు.
Nizamabad Mayor | త్రినేత్ర.న్యూస్: మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ (Nizamabad)నగర ప్రజలు ఏ పార్టీకీ స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. దీంతో ఏ ఒక్క పార్టీ మెజార్టీ మార్కు దాటకపోవడంతో హంగ్ ఏర్పడింది. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మేయర్ (Nizamabad Mayor) పీఠం దక్కించుకోవడానికి కావాల్సిన సంఖ్యా బలం లేదు. దీంతో గత రెండు రోజులుగా మేయర్ ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతున్నది. అయితే మేయర్ రేసు నుంచి బీజేపీ (BJP) తప్పుకుంటున్నట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రకటించడంతో.. కాంగ్రెస్ (Congress) తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. ఎంఐఎంతో ఒప్పందం కుదరడంతో హస్తం పార్టీ ఖాతాలోకి నిజామాబాద్ చేరింది.
నగరపాలక సంస్థలో మెుత్తం 60 డివిజన్లు ఉండగా బీజేపీ 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్‌కు 17, ఎంఐఎంకు 14, బీఆర్ఎస్‌కు ఒక స్థానం లభించింది. దీంతో కాంగ్రెస్, ఎంఐఎం (MIM) పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. కాంగ్రెస్‌కు మేయర్ పదవి, ఎంఐఎంకు డిప్యూటీ మేయర్ పదవి పంచుకునేలా ఇరు పార్టీల మధ్య అంగీకారం కుదిరింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్‌గౌడ్ ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేసుకోవడంతో కాంగ్రెస్–ఎంఐఎం కూటమి బలం 33కు చేరింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మేయర్ పీఠం చేజిక్కించుకోనుంది.
కాగా, కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. 19వ డివిజన్ నుంచి ఆ పార్టీ మేయర్ అభ్యర్థిగా పోటీచేసిన కాటిపల్లి శమంత ఓడిపోయారు. దీంతో పార్టీకిలోనే మరికొందరు ఆ పదవి కోసం పోటీపడుతున్నారు. 21వ డివిజన్ నుంచి గెలిచిన పంచరెడ్డి లలిత, 49వ డివిజన్‌లో కూరగాయల ఉమారాణి, 41వ డివిజన్‌కు చెందిన బొంబోతుల పుజిత, 12వ డివిజన్ దూమాల అరుంధతి, అలాగే 9వ డివిజన్ నుంచి గెలిచిన కేతావత్ సురేఖలు మేయర్ ఆశిస్తున్నారు. వీరిలో ఒకరు ఎస్టీ కాగా, మిగిలిన నలుగురు బీసీలు. దీంతో ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నారు. ఇందూరు తదుపరి మేయర్ ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
సంబంధిత వార్తలు

Vemula Prashanth Reddy | ఆర్భాటాలకు వందల కోట్లు.. భీమ్‌గల్ అభివృద్ధికి రూ.20 కోట్లు లేవా?
ఆగస్టు 19, 2026

Chamala Kiran Kumar Reddy | బండి సంజయ్.. గత ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకున్నదెవరు?: ఎంపీ చామల
ఆగస్టు 19, 2026

Raja Singh | తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాలు.. అందుకే జాతీయ కార్యవర్గంలో ఒక్కరికీ చోటు దక్కలే: ఎమ్మెల్యే రాజాసింగ్
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు



