KCR Farm House | కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు..!
KCR Farm House | సిద్దిపేట పర్యటనకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. శుక్రవారం ఉదయం 9.30 గంటల వరకు ఎంపీలు, ఎమ్మెల్సీలందరూ అసెంబ్లీలో అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు.
KCR Farm House | త్రినేత్ర.న్యూస్ : సిద్దిపేట పర్యటనకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. శుక్రవారం ఉదయం 9.30 గంటల వరకు ఎంపీలు, ఎమ్మెల్సీలందరూ అసెంబ్లీలో అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. ఎర్రవల్లిలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను ఎంపీలు, ఎమ్మెల్సీలు.. అధికారులతో కలిసి పరిశీలించనున్నారు. ఎంపీలకు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు సమాచారం. 22ఏ భూములపై పక్కా వ్యూహంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొనేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అధికార ప్రతినిధులకు అవగాహన కల్పించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసరాల్లోని భూములపై సమగ్ర విచారణ జరపాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అధికారుల బృందం నిన్న ఎర్రవల్లిలో పర్యటించి సర్వే నిర్వహించింది.
అయితే ఎంపీలు, ఎమ్మెల్సీల బృందానికి నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి నాయకత్వం వహిస్తున్నట్లు గాంధీ భవన్‌లో ప్రచారం జరుగుతోంది. కానీ పర్యటనపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదని ఓ సీనియర్ కాంగ్రెస్ నేత అన్నారు.
తాజావార్తలు
- ●Road Accident | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
- ●Youtuber Haribabu | యూట్యూబర్ హరిబాబు హత్య కేసులో కీలక పరిణామం..
- ●Python | దుర్గం చెరువు @ ఐటీ కంపెనీ ముందు కొండ చిలువ ప్రత్యక్షం
- ●Horoscope | శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ఆటంకాలు.. జర జాగ్రత్త సుమా..!
- ●Sun Transit 2026 | కన్యారాశిలోకి సూర్యుడు.. ఈ నాలుగు రాశుల వారికి ఉద్యోగం, కెరీర్లో పురోగతి..!
- ●Ravinder Rao | సీఎం రేవంత్‌రెడ్డికి కొండూరి రవీందర్రావు లీగల్ నోటీసు

Road Accident | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

Youtuber Haribabu | యూట్యూబర్ హరిబాబు హత్య కేసులో కీలక పరిణామం..

Python | దుర్గం చెరువు @ ఐటీ కంపెనీ ముందు కొండ చిలువ ప్రత్యక్షం

Horoscope | శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ఆటంకాలు.. జర జాగ్రత్త సుమా..!






